నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందనా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఛలో సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన.. ప్రజెంట్ ఎలాంటి సిచువేషన్ ఎదురుకుంటుంది ఒకదాని తర్వాత ఒకటి డిజాస్టర్ గా మారడంతో నేషనల్ క్రష్ కాస్త ఎనిమిగా మారిపోయింది . అంతేకాదు ఈ మధ్యకాలంలో రష్మిక కొంచెం నోటి దూకుడు ప్రదర్శిస్తూ స్టార్ హీరోలని టార్గెట్ చేయడం ఆమెకు మైనస్ గా మారింది . రీసెంట్ గా రష్మిక తన చెల్లికి ఆల్ ద బెస్ట్ చెబుతూ ఓ ట్వీట్ చేసింది. ఈ క్రమంలోనే మరోసారి రష్మిక మందన చెల్లి పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ లోకి వచ్చింది.
కన్నడ ఇండస్ట్రీకి చెందిన రష్మిక మందన హీరోయిన్ అవ్వడానికి చాలా కష్టపడింది . అంతేకాదు రష్మిక మందన్నాది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ . ఎంతలా అంటే ప్రతి నెల ఇంటి అద్దె చెల్లించే స్తోమత లేక ఎక్కడ తక్కువ రెంట్ దొరికితే అక్కడికి వీధులు పట్టుకొని వెళ్లిపోయేవారు అంటూ ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చింది . అంతే కాదు ఓ బొమ్మ కొనడానికి కూడా నెలలు కష్టపడేవారు అంతలా కష్టాలు పడిన రష్మిక మందన ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే కోట్లకు కోట్ల ఆస్తిని సంపాదించింది. ఎంతలా అంటే ఒకటి రెండుసార్లు ఆమె నివాసం ఆఫీసులపై ఐటి దాడులు కూడా జరిగాయి . అంతలా కోట్ల ఆస్తిని కూడా పెట్టింది .
ప్రస్తుతం రష్మిక చేతుల్లో బడా ఆఫర్స్ ఉన్నాయి . వాటిల్లో మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పుష్ప2 .. బాలీవుడ్లో నటిస్తున్న అనిమల్ సినిమా . ఈ రెండు హిట్ అయితే రష్మిక మందన కెరియర్ దశ తిరిగిపోతుంది అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక మందన తన చెల్లికి ఎగ్జామ్స్ జరగబోతున్నాయని ఆల్ ద బెస్ట్ చెప్పమని ఫ్యాన్స్ కి చెప్పింది. ఎగ్జామ్స్ అంటే ఏ బోర్డ్ ఎగ్జామ్స్ అనుకునేరు. స్కూల్ ఎగ్జామ్స్ ..రష్మిక మందన చెల్లి నాలుగో తరగతి ఎగ్జామ్స్ రాస్తుంది.
రష్మిక కి ఇంత చిన్న చెల్లెలు ఉందా అంటూ షాక్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే రష్మిక 26 తన చెల్లి ఏజ్ సుమారు 12 ఉంటే మధ్యలో 14 ఏళ్ల గ్యాప్ ఎందుకు వచ్చింది అంటూ సరదాగా చర్చించుకుంటున్నారు .ఈ క్రమంలోనే రష్మిక ఫాదర్ ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఎదుర్కున్నారని.. కనీసం ఫుడ్ కి కూడా కష్టపడ్దారని,,ఆ తర్వాత వాళ్లు అబ్బాయి కోసం ట్రై చేస్తే బేబి గర్ల్ పుట్టిందట. వాళ్ళు చాలా ఫైనాన్షియల్ గా కష్టాలు ఎదుర్కొన్నారని ..అప్పట్లో కన్నడ మీడియాలో వార్తలు వినిపించాయి . గతంలో రష్మిక మందన కూడా ఇలాంటి వార్తల పై స్పందించింది . “నన్నే కాదు నా ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్నారు . అంతా శత్రువులు అయిపోయామా.. మేము అంటూ ఫైర్ అయిపోయింది “. అంతేకాదు ఎవరి లిమిట్స్ ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటే అందరికీ మంచిది అంటూ కూడా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది.