Moviesఆ హీరోయిన్ తల్లి సీనియ‌ర్ ఎన్టీఆర్ ప‌క్క‌న హీరోయిన్‌గా చేసిందని తెలుసా…!

ఆ హీరోయిన్ తల్లి సీనియ‌ర్ ఎన్టీఆర్ ప‌క్క‌న హీరోయిన్‌గా చేసిందని తెలుసా…!

1978వ దశకంలో జయప్రద, జయసుధ, శ్రీదేవి, విజయశాంతి లాంటి హీరోయిన్లతో పాటు జయ‌చిత్ర కూడా పాపులర్ హీరోయిన్గా రాణించింది. మరి జయప్రద, జయసుధ, శ్రీదేవి అంతా పేరు రాకపోయినా జయ‌ చిత్ర కూడా చాలా మంచి సినిమాలు చేసింది. వీరి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ. జయచిత్ర 1957లో జన్మించింది. ఆమె తండ్రి మహేంద్ర ఒక వెటర్నరీ డాక్టర్.. ఆమె తల్లి అమ్మాజీ
తండ్రి ఉద్యోగ నేపథ్యంలో వీరి కుటుంబం చెన్నైకు వెళ్ళింది.

అక్కడే జయచిత్ర పుట్టి రోహిణిగా పెరిగింది. తల్లిదండ్రులు పనుల్లో బిజీగా ఉన్నప్పుడు.. అమ్మమ్మ అలనా పాలన ఆమె సంరక్షణలోనే జయ‌చిత్ర పెరిగింది. తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో జయచిత్ర ఆరేళ్ళ వయసులోనే భక్త పోతన అనే తెలుగు సినిమాలో బాలనటిగా నటించింది. ఇక జ‌య‌చిత్ర తల్లి పేరు అమ్మాజీ. అలాగే ఆమెకు అక్కమ జ‌య‌శ్రీ అనే మరో పేరు కూడా ఉండేది. ఆమె తమిళంతోపాటు తెలుగులోనూ కొన్ని సినిమాలలో నటించారు.

జ‌య‌చిత్ర త‌ల్లి అమ్మాజీ మహావీరన్ అనే తమిళ సినిమాలో నటించారు. ఇది 1955లో తెరకెక్కింది.
అలాగే తెలుగులో రోజులు మారాయి, దైవబలం లాంటి సినిమాలలో కూడా నటించారు. అలాగే సీనియర్ ఎన్టీఆర్ కి జోడిగా కూడా సినిమాలు చేశారు. అసలు ఈ తరం జనరేషన్ లో ఉన్న వారికి జయ‌చిత్ర గురించి తక్కువగా తెలుసు. అలాంటిది జయ‌ చిత్ర తల్లి సీనియర్ ఎన్టీఆర్‌కు జోడిగా హీరోయిన్గా నటించింది అన్న విషయం ఎవరికీ తెలియకపోవచ్చు.

జయ‌చిత్ర హీరోయిన్ మాత్రమే కాదు ఆమెలో మంచి దర్శకురాలు కూడా ఉన్నారు. ఆమె 1991లో వ‌చ్చిన ఓ తమిళ సినిమాలో హీరోయిన్గా నటించడంతోపాటు నిర్మాతగా దర్శకురాలిగా కూడా వ్యవహరించారు. అయితే దురదృష్టవశాత్తు ఈ సినిమా ప్లాప్ అయింది. ఆ తర్వాత 2010లో తన కుమారుడు అమ్రేష్‌ గణేష్ ని ఓ తమిళ సినిమాతో హీరోగా పరిచయం చేయడంతో పాటు ఆమె నిర్మాతగాను.. దర్శకురాలిగాను వ్యవహరించారు.

జయ‌చిత్ర తన కొడుకు అమ్రేష్ ను కోలీవుడ్లో హీరోగా నిలబెట్టుకునెందుకు చాలా ప్రయత్నాలు చేసిన అవన్నీ విఫలమయ్యాయి. ఇక తెలుగులో కూడా ఆమె సీనియర్ హీరోలకు తల్లిగా, అక్కగా ఎన్నో కీలకపాత్రలో నటించి మెప్పించారు. 1990 దశకం సినీ అభిమానులకు జయ‌చిత్ర అంటే బాగా తెలుసు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news