సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టాక హీరోయిన్స్ ఏ రేంజ్ లో ఆస్తులు సంపాదించుకుంటారో తెలియదు .. కానీ బ్యూటీల కోసం మాత్రం లక్షలకు లక్షలు ఖర్చులు చేస్తూనే ఉంటారు . మరి ముఖ్యంగా బాలీవుడ్ బడా సెలబ్రిటీస్ అయితే వాడే క్రీమ్ ఒక్కోక్కతి లక్షలు లోనే ఉంటుంది . ఒక క్రిమ్ తో ఆపుతారా పది పదకొండు క్రీములను ముఖానికి రాసుకొని మరింత అందంగా కనిపించడానికి నానా రకాలుగా తిప్పలు పడుతూ ఉంటారు .
మరి కొంత మంది హీరోయిన్స్ ..జీరో సైజ్ అంటూ కడుపుకు అన్నం తినకుండా.. లావు తగ్గడానికి వెయిట్ ని కంట్రోల్ చేసుకోవడానికి.. స్లిమ్ గా కనిపించడానికి పలు రకాల తిప్పలు పడుతూ ఉంటారు . రీసెంట్గా అలాంటి వాటిపై స్పందించింది తాప్సి . తాను ఆ కేటగిరిలోకి వస్తానని అందుకే వాళ్ళ అమ్మ నాన్నలు ఇప్పటికి తనని తిడుతూ ఉంటారని చెప్పకు వచ్చింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సికు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన క్వశ్చన్ ఎదురైంది.
” మీరు మంచి ఫిజిక్ కోసం ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తారు . ఎలాంటి డైట్ లో ఫాలో అవుతారు అన్న కోణంలో హోస్ట్ ప్రశ్నించగా.. తనకంటూ ప్రత్యేకంగా డైటీషియన్ పెట్టుకున్నాను అని.. వాళ్ళు చెప్పినట్లే పూర్తిగా తన డైట్ ఉంటుందని ..కచ్చితంగా జిమ్ , యోగా లాంటివి చేస్తూ ఉంటానని.. దాని కోసం స్పెషల్ ట్రైనర్స్ ని ఫిక్స్ చేసుకున్నారని.. వాటి కోసమే నేను నెలకు లక్షల్లోనే వాళ్ళకి ఖర్చు చేస్తూ ఉంటానని.. ఈ విషయంపై ఇప్పటికి మా అమ్మానాన్న అరుస్తూనే ఉంటారని” చెప్పకు వచ్చింది . అంతేకాదు తనలాగే సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ చేస్తూ ఉంటారని కూడా చెప్పి షాక్ ఇచ్చింది . ఈ లెక్కన చూసుకుంటే తాప్సి లాంటి హీరోయిన్ నెలకు లక్షలు ఖర్చు చేస్తుంటే ..సమంత , తమన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ తమ బ్యూటీల కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేసుంటారో అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు..!!