Moviesసీనియర్ ఎన్టీఆర్ కృష్ణ‌కుమారి కంటే ముందే ఆ హీరోయిన్ ప్రేమ‌లో ప‌డ్డారా...

సీనియర్ ఎన్టీఆర్ కృష్ణ‌కుమారి కంటే ముందే ఆ హీరోయిన్ ప్రేమ‌లో ప‌డ్డారా ?

నటరత్న సీనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా ప్రేమికులకు ఒక ఆరాధ్య దైవం. 70 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటికీ నందమూరి వంశం లెగ‌సి బలంగా కంటిన్యూ అవుతు వస్తోందంటే అందుకు ఎన్టీఆర్ వేసిన బీజం అని చెప్పాలి. ఎన్టీఆర్‌కు తన తోటి నటీనటులు అంటే ఎంతో గౌరవం. తన సినిమాల‌లో నటించే హీరోయిన్లతో పాటు సినిమాకు పని చేసే దర్శకులు.. సినిమాకు పెట్టుబడి పెట్టే దేవుడు. నిర్మాత.. ఇతర నటీనటులను ఆయన ఎంతో గౌరవించేవారు. ఆయన తన కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో ఎన్నో సినిమాలలో కలిసి నటించారు.

అయితే ఏ హీరోయిన్ విషయంలోను ఆయనపై పెద్దగా పుకార్లు రాలేదు. ఇద్దరు హీరోయిన్ల విషయంలో మాత్రం ఆయన ఎఫైర్ నడిపాడు అన్న కథనాలు మద్రాసులో బాగా వినిపించాయి. అందులో ఒకటి కృష్ణకుమారి. ఎన్టీఆర్ కృష్ణకుమారిని ప్రేమించారని.. ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారన్న‌ది తెలిసిందే. వారిద్దరి పెళ్లి జరుగుతున్న రోజు ఎన్టీఆర్ సోదరుడు నందమూరి త్రివిక్రమరావు నేరుగా కృష్ణకుమారి ఇంటికి వెళ్లి పిస్టల్ తీసి నిన్ను కాల్చి చంపేసి.. నేను కూడా చచ్చిపోతానని వార్నింగ్ ఇచ్చార‌ని. అప్పటి సిని ప్రముఖులు చెబుతూ ఉంటారు.

త్రివిక్రమరావు నేరుగా తనను చంపేస్తానని బెదిరించడంతో.. వెంటనే కృష్ణకుమారి పెట్టే బేడా సర్దుకుని బెంగళూరుకు మ‌కాం మార్చేసింది. ఎన్టీఆర్ మాత్రం కృష్ణకుమారిని బాగా ఇష్టపడ్డారని అంటారు. ఆమెని పెళ్లి చేసుకుంటానని తన భార్య బసవతారకం అనుమతి కూడా తీసుకున్నారట. అయితే కృష్ణకుమారి కంటే ముందు ఎన్టీఆర్ మరో హీరోయిన్ దేవికితోను సఖ్యతతో ఉండడంతో పాటు ఆమెను ఇష్టపడ్డారని అప్పట్లో రూమర్లు అయితే ఉన్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు అలనాటి మేటినటి దేవిక. ఎన్టీఆర్ స్టార్ హీరోగా మారాక శ్రీదేవితో నటిస్తే ఎలాంటి ? క్రేజ్ ఉండేదో.. 1961లో ఎన్టీఆర్ దేవిక కాంబినేషన్ కు కూడా అంతే క్రేజ్ ఉండేది.

తెలుగు సినిమా ఫౌండర్ అయిన రఘుపతి వెంకటరత్నం నాయుడుకు దేవిక సమీప బంధువు అవుతుంది. అప్పట్లో దేవిక – ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. విచిత్రం ఏమిటంటే ఏఎన్ఆర్ చాలామంది హీరోయిన్లను ఎన్టీఆర్‌తో నటించకుండా వాళ్ళ డేట్లు ముందుగానే బ్లాక్ చేయించేవారని అంటారు. అలా సావిత్రి ఎన్టీఆర్ పక్కన నటించకుండా మూడు నాలుగు సంవత్సరాల పాటు ఆమె డేట్లు అన్ని బ్లాక్ చేయించేశారట. తనకు హీరోయిన్లు లేకపోవడంతో ఎన్టీఆర్ దేవికను, కృష్ణకుమారిని బాగా ప్రమోట్ చేశారని అంటారు.

అందుకే ఎన్టీఆర్ – దేవిక కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అటు దేవిక కూడా ఎన్టీఆర్‌ను బాగా ఇష్టపడింది. అయితే దేవిక బాగా సంపాదించిన తర్వాత వయసులో తనకంటే చిన్నోడు అయినా దేవదాసు అనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మాయలో పడి అతడి మాటలు నమ్మి సర్వం అర్పించేసింది. దీంతో తెలుగు సినిమా దర్శకులు ఆమెను పట్టించుకోవడం మానేశారు. అయితే దేవికకు కనక అనే ఒక కుమార్తె ఉంది. ఆమె కూడా సినిమాల్లోకి వచ్చిన అంతగా సక్సెస్ కాలేకపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news