జెమినీ గణేషన్ ప్రముఖ తమిళ నటుడు. తమిళంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ టైంలో ఓ పాపులర్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. జెమినీ తెలుగులోనూ కొన్ని సినిమాలు చేశారు. ఆయన తెలుగులో మావూరి అమ్మాయి – పవిత్ర ప్రేమ – పతివ్రత – శృంగార లీల – రుద్రవీణ – ఉన్నాల్ ముడియుం తంబి – భామనే సత్యభామనే సినిమాల్లో నటించారు.
ఇక జెమినీ 1920లో పుట్టగా… ధీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో 2005లో మృతిచెందారు. ఇక తెలుగు వాళ్లకు జెమినీ గణేషన్ తెలుగు మహానటి సావిత్రి భర్తగా బాగా తెలుసు. జెమినీ కంపెనీలో పనిచేయడంతో ఆయన్ను అందరూ జెమినీ గణేషన్‌గా పిలుస్తారు. ఆ పేరే చివరకు ఆయనకు అలా స్థిరపడిపోయింది.
అలాగే జెమినీకి కదళ్ మన్నాన్, సాంబా అనే ముద్దు పేర్లు కూడా ఉన్నాయి. సైన్సులో గ్రాడ్యుయేట్ చేసిన ఆయన మద్రాస్‌లో లెక్చరర్‌గా పనిచేశారు.
జెమినీ ఎంత గొప్ప నటుడో వ్యక్తిగతంగా అంతే కాంట్రవర్సీలకు కారణమయ్యాడు. ఆయన జీవితంలో మొత్తం నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆయన మొదటి భర్త పుష్పవల్లి. ప్రముఖ బాలీవుడ్ నటీమణి రేఖ తల్లి. పుష్పవల్లి స్వస్థలం ఏపీలోని చిత్తూరు జిల్లా. ఆ తర్వాత కొంత కాలానికే ఆమెను వదిలించేసుకుని అలివేలును రెండో పెళ్లి చేసుకున్నాడు. జెమినీ చేష్టలతో ఆమె మానసిక వ్యాధికి గురైంది.
ఆ తర్వాత మహానటి సావిత్రి వెంటపడి మరీ ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెను పూర్తిగా నాకించేసి… ఆమెను పతనం చేసి మరీ వదిలించుకున్నాడు. ఇక తన 79వ యేట సెక్రటరీ జులియానాను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. 79వ వయస్సులో కూడా నాలుగో పెళ్లి చేసుకున్నాడు అంటే జెమినీ బిహేవియర్ ఎలా ఉండేదో అర్థమవుతోంది. అయితే ఆ సెక్రటరీ మాత్రం జెమినీని హింసించి మరీ వదిలేసిందంటారు.
అయితే జెమినీ తనకంటే వయస్సులో 30 ఏళ్లు చిన్నది అయిన రాజశ్రీతోనూ ప్రేమాయణం నడిపాడని అంటారు. జెమినీకి అమ్మాయిల బలహీనత బాగా ఎక్కువ. అమ్మాయిల పిచ్చోడు… కొత్త అమ్మాయి కనపడితే బుట్టలో వేసేదాకా నిద్రపోడనే అంటారు. అలాగే మద్యానికి విపరీతంగా బానిస అయ్యాడు. అవే అతడిని నాశనం చేయడంతో పాటు అతడిని నమ్ముకున్నోళ్లను ముంచేశాయి.