Moviesవిడాకుల ముందు నుంచే స‌మంత ఇంత‌ భ‌యంతో బ‌తికిందా… నిజాలు బ‌య‌ట‌కొచ్చాయ్‌…!

విడాకుల ముందు నుంచే స‌మంత ఇంత‌ భ‌యంతో బ‌తికిందా… నిజాలు బ‌య‌ట‌కొచ్చాయ్‌…!

స్టార్ హీరోయిన్ సమంత గత రెండేళ్లుగా చాలా అడ్డంకులు.. ప్రతికూల పరిస్థితులతో పోరాటం చేస్తున్న మాట నిజం. కారణాలు ఏవైనా కావచ్చు.. తను ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో మనస్పర్ధలు. అక్కినేని లాంటి ఫ్యామిలీలోనే ఆమె ఇమడలేకపోయింది. చైతన్యకు విడాకులు ఇచ్చేసి బయటకు వచ్చేసి స్వేచ్ఛ‌ పక్షిలా జీవిస్తోంది. చైతుకు విడాకులు ఇచ్చేసి కూడా ఏడాదిన్నర అవుతుంది. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతుంది

కొద్ది నెలల క్రితం యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఏప్రిల్ లో శాకుంతలం సినిమాతో మరోసారి మెస్మరైజ్ చేసేందుకు వస్తుంది. అలాగే వెబ్ సిరీస్ లతోపాటు హాలీవుడ్ ప్రాజెక్టులకు సైతం సైన్ చేస్తోంది. కోలీవుడ్ లోనూ కార్తీ హీరోగా తెరకెక్కే ఒక సినిమాకు సైన్ చేసింది. టాలీవుడ్ లో విజయ్ దేవరకొండకు జోడిగా నటిస్తున్న ఖుషి సినిమాలో నటిస్తోంది. ఇక గత కొద్దిరోజులుగా మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత కాస్త కోలుకుని ఇప్పుడే ఖుషి సినిమా షూటింగ్లో జాయిన్ అయింది.

ఇక శాకుంతలం సినిమా ప్రమోషన్లలో ఆమె మాట్లాడుతూ కొన్ని సంచలన నిజాలు బయట పెట్టింది.
మొదటిసారి శాకుంతలం కథ విన్నప్పుడు చేయటానికి చాలా భయమేసిందని.. నా పాత్ర గురించి దర్శకుడు గుణశేఖర్ చెప్పినప్పుడు తాను ఈ సినిమా చేయనని చెప్పానని.. అయితే ఆయన తనను ఒప్పించి ఈ పాత్ర చేసేలా మెప్పించారని సమంత తెలిపింది. తాను గత మూడేళ్లుగా ఒక నియమం పెట్టుకున్నానని… చాలా భయపడితే ముందుగా ఆ భయాన్ని దాటాలని నిర్ణయించుకున్నానని.. ఏ అంశమైతే తనను భయపెట్టిందో.. దానిని ఎదుర్కోవటం మొదలుపెట్టానని.. అలా మూడేళ్లలో వ్యక్తిగతంగా సినిమాలపరంగా నాలో చాలా మార్పు వచ్చిందని సమంత తెలిపింది.

తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ, పరిస్థితుల నుంచి వ్యక్తిగతంగా మరింత రాటుదేలాన‌ని చెప్పింది. ఇప్పటికీ తనకు కొన్ని భయాలు ఉన్నాయని.. అయితే వాటిని ఎదుర్కొనే ధైర్యం కూడా తనకు ఉందని చెప్పింది. సమంత – చైతన్యకు విడాకులు ఇచ్చి ఏడాదిన్న‌ర‌ దాటుతుంది. అయితే మూడేళ్లుగా తాను ఎన్నో విషయాలలో భయపడ్డానని.. ఎంతో తీవ్రమైన మానసిక సంఘర్షణ కూడా ఎదుర్కొన్నానని తెలిపింది. సమంత చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే విడాకులకు దాదాపు ఏడాదికి ముందు నుంచే ఆమె అక్కినేని ఫ్యామిలీలో ఇబ్బందులకు గురవడంతో పాటు అక్కడ సర్దుబాటు కాలేకపోయిందని.. అయినా కూడా అవన్నీ మనసులో దాచుకుని సర్దుకుపోవటానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

చైతుకు విడాకులు ఇవ్వటానికి మూడు నాలుగు నెలల ముందు కూడా వారిద్దరు కలిసి గోవాలో ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల ముందు వరకు.. విహారయాత్రలోనూ చైతు, సమంత కలిసే ఉన్నారు. సమంత చెప్పిన మాటలను బట్టి చూస్తే చైతు కంటే కూడా అక్కినేని ఫ్యామిలీతోనే ఆమె ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొందని.. అయితే అది అమల వైపు నుంచా ? నాగార్జున వైపు నుంచా అన్నది క్లారిటీ లేదని సమంత మాటలను బట్టి చాలామంది విశ్లేషిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news