ఎస్ ..ప్రెసెంట్ ఇదే న్యూస్ ..బాలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఆరోగ్యం మళ్లీ క్షీణించిందా..? అంటే అవునని అంటున్నారు బాలీవుడ్ మీడియా వర్గాలు . ఇప్పటివరకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేని ప్రభాస్ కు ఇన్నర్ గా ఏదో ఆరోగ్యం బాగోలేదని.. ఆ కారణంగానే ఇలా వరుసగా ఈ మధ్యకాలంలో అనారోగ్యానికి గురవుతున్నారు అంటూ బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది .
మనకు తెలిసిందే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఓ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నాడు, ప్రభాస్ ప్రెసెంట్ నాలుగు బడా ప్రాజెక్టులో నటిస్తున్నాడు. ఆయన నటించిన ఆది పురుష్ సిద్ధంగా ఉంది. అయితే ప్రభాస్ ఆరోగ్యం బాగో లేకపోవడంతో ఆయన చేస్తున్న సినిమా షూట్స్‌కి బ్రేక్ వేసి మరి ఆయన రెస్ట్ తీసుకుంటున్నట్లు.. ఇదివరకే వార్తలు వినిపించాయి. కాగా నిన్న అర్ధరాత్రి నుంచి ప్రభాస్ ఆరోగ్యం మళ్ళీ బాగోలేదని ..ఈ కారణంగా ఆయనని హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారంటూ బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది.
అంతేకాదు ప్రభాస్ తన ట్రీట్మెంట్ కోసం విదేశాలకు సైతం వెళ్లడానికి సిద్ధం సిద్ధపడుతున్నారు అంటూ సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ క్రమంలోని అభిమానులు టెన్షన్ పడుతున్నారు . ప్రభాస్ కి అసలు ఏం బాగోలేదు..? హెల్త్ బులిటిన్ రిలీజ్ చేస్తే అభిమానులకు క్లారిటీ వస్తుంది..? అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే అసలు ప్రభాస్ కి నిజంగానే ఆరోగ్యం బాగోలేదా ..? లేదా కావాలనే బాలీవుడ్ మీడియా ఇలా చిత్రీకరించి ప్రభాస్ ఆఫర్స్ ని మరో హీరోస్ కి వచ్చేలా ప్లాన్ చేస్తుందా..? తెరవెనుక ఏం జరుగుతుంది..? అన్న ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . దీనిపై ప్రభాస్ స్పందించకపోతే పరిస్థితి చేయి జారిపోయే అవకాశం ఎంతైనా ఉంది అన్నది సినిమా విశ్లేషకులు అభిప్రాయం..!!