సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం .. చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూడడం.. అలవాటుగా మారిపోయింది . ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ ఏదైనా మాట్లాడాలి అంటే ఆచి తూచి ..ఆలోచించి ..నిర్ణయించుకొని.. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి . పొరపాటున ఏదైనా టంగ్ స్లిప్ అయితే మాత్రం.. సోషల్ మీడియాలో ట్రోలర్స్ ఏకీపారేస్తారు . అలాంటి ట్రోలర్స్ చేతికి అడ్డంగా చిక్కిపోయాడు టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న నాని .
నాని తాజాగా నటిస్తున్న సినిమా దసరా . శ్రీకాంత్ ఓదేల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటించింది. మార్చి 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు నాని . ఈ క్రమంలోనే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన నానిని హోస్ట్ విచిత్రమైన ప్రశ్న వేసింది . “ఈ సినిమా కోసం మీరు హెయిర్ పెంచుకున్నారు అంట కదా ..? అని అడిగారు.. యాంకర్ ప్రశ్నకి సమాధానంగా..”అవును” అంటూ చెప్పిన నాని.. మాటలు మధ్యలోనే హోస్ట్ “ఒరిజినల్ జుట్టు నే కదా” అంటూ సరదాగా ఆటపట్టించింది.
ఈ క్రమంలోనే నాని నవ్వుతూ..” 100% ఒరిజినల్ అండి . ఇదే ప్రశ్న అందరిని అడగకండి..” అంటూ గట్టిగా నవ్వేశారు . ఈ క్రమంలోనే మీమ్ర్స్ కి మంచి కంటెంట్ దొరికింది , మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు విగ్గు పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళకి ఘాటుగా కౌంటర్ వేసేందుకే హీరో నాని ఇలా సమాధానమిచ్చాడు అంటూ జనాల ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు మరి ముఖ్యంగా కెరియర్ స్టార్టింగ్ నుంచి నాని ని తొక్కేయడానికి చూస్తున్న టాలీవుడ్ హీరో కూడా విగ్గు పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే.
ఈ క్రమంలోని సరైన టైమ్ కోసం వెయిట్ చేస్తున్న నాని టైం రాగానే అతగాడికి ఇచ్చి పడేసాడు . “నాది ఒరిజినల్ అంటూ అతడిది విగ్ హైర్ ” అంటూ చెప్పకనే చెబుతూ పరోక్షంగా ఆ హీరోని ఏకిపారేశారు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో నానికి కూసింత ఎక్కువగానే మాట్లాడుతున్నాడు అంటూ జనాల సైతం ఫైర్ అవుతున్నారు. మరికొందరు స్టార్ హీరో ఫ్యాన్స్ వచ్చిన పని చూసుకోక మిగతా హీరోలతో నీకేం పని రా పొట్టోడా..? అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాని సరదాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!