సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత – నాగచైతన్య పేర్లు చెప్తే అభిమానులకి అదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుంది . ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెరపై క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న ఈ జంట .. కొన్నాళ్లకు ఆ బంధాన్ని నిజం చేస్తూ రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ గా లైఫ్ ని ముందుకు తీసుకెళ్లారు. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత ..అక్కినేని హీరో నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు .
అయితే వాళ్లు ప్రేమించుకున్న అన్ని నాళ్ళు కూడా కలిసి కాపురం చేయలేకపోయారు. వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా డివోర్స్ తీసుకొని వేరువేరుగా బ్రతుకుతున్నారు ఈ జంట. ప్రజెంట్ తమ లైఫ్ లో సింగిల్గానే మూవ్ అవుతున్నారు . కాగా రీసెంట్గా నాగచైతన్య – సమంత కంటే ముందే ఓ అమ్మాయిని ప్రేమించాడు అనే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే ఆ అమ్మాయి ఎవరో కాదు .. అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యారాయ్ . ఇదే విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య చెప్పుకొచ్చారు .
సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ను ఎక్కువగా ఇష్టపడే వాడిని అని.. లైక్ చేసేవాడిని అని.. ఆమె అంటే ఆయనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. అంతేకాదు కాలేజ్ డేస్ లో ఆమె ఫోటోను ఎన్నిసార్లు కిస్ చేశానో కూడా చెప్పుకొచ్చాడు . ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యాన్స్ నాగచైతన్య నాన్న కంటే టూ రొమాంటిక్ అంటూ ట్యాగ్ చేసి ట్రెండ్ చేస్తున్నారు . మరి కొంతమంది నీలో అంత మ్యాటర్ ఉందా..? అంటూ కూడా వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు . కానీ ఒకటి మాత్రం నిజం .. విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య చాలా సైలెంట్ అయిపోయాడు . బయట పెద్దగా కనిపించడం లేదు . సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండడం లేదు . తన సినిమాలు చేసుకుంటూ ..సినిమా టైంలో ప్రమోషన్స్ చేసుకుంటూ సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు . త్వరలోనే నాగచైతన్య – శోభిత ధూళిపాలనిఉ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!