కోడి రామకృష్ణ.. తెలుగు సినీ రంగంలో అగ్రదర్శకుడిగా ఎదిగిన సెన్సేషనల్ దర్శకుడు. దాసరి నారాయ ణరావు శిష్యుడిగా సినీ రంగం ప్రవేశం చేసిన కోడి రామకృష్ణ మాస్ నుంచి క్లాస్ వరకు అనేక సూపర్ హిట్ చిత్రాలు కొట్టారు. మంగమ్మగారి మనవడు సినిమా తర్వాత.. ఇక, కోడి కొట్టిన హిట్లు అన్నీ ఇన్నీ కావు. మంగమ్మగారి మనవడు సినిమాయే బాలయ్య కెరీర్‌లో ఫస్ట్ కమర్షియల్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్.
కోడి రామకృష్ణ దర్శకుడిగా ఈ సినిమాలో అనేక ప్రయోగాలు చేశారు. ఇక, తర్వాత.. అంజి, అరుంధతి.. వంటి సినిమాలు కూడా రికార్డుల మోత మోగించాయి. భక్తిరస చిత్రాలకు కోడి రామకృష్ణ పెట్టింది పేరు. స్టార్ కాస్టింగ్ లేకుండానే ఆయన ఎన్నో సూపర్ హిట్లు కొట్టారు. కోడి రామకృష్ణ మూవీ అంటేనే.. ప్రత్యేకతలు ఉంటాయి. అయితే.. గతంలో అంటే.. ఇప్పుడున్నంత టెక్నాలజీ లేనప్పుడు కూడా ఆయన గ్రాఫిక్స్‌తో ఎన్నో మాయలు చేశారు.
ఇక ఆయన సినిమాల్లో వ్యాంపు పాత్రల ద్వారా ఆయన పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మంగమ్మగారి మనవడు చిత్రంలో చేపల పులుసు పేరుతో వై. విజయను ఆయన చూపించిన తీరు.. ఎక్కడా అసభ్యం లేకుండానే.. కుర్రకారులో గిలిగింతలు పెట్టొచ్చనే విషయాన్ని ఆయన నిరూపించారు. ఈ సినిమాలో వై. విజయ సూపర్ టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత.. వీరిమధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. కోడి రామకృష్ణ తీసిన దాదాపు అన్ని సినిమాల్లో వై. విజయకు ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చేవారు.
ఎక్కడా రాజీ పడకుండా.. ఎలాంటి సీన్లలో అయినా.. విజయ నటించడం మరో విశేషం. అయితే.. వీరి మధ్య చిన్న చిన్న అనుబంధాలు ఉన్నాయనేది కూడా సినీరంగంలో ఒక టాక్ నడిచేది. అబ్బ ఏమీ లేకుండా.. వై. విజయను ఎవరూ పెట్టుకోరు
అని ప్రముఖ నటుడు అనేవారు. సో.. దీనిని బట్టి కోడికి-విజయకు మధ్య కెమిస్ట్రీ బాగానే ఉండేదని అనేవారు.