సాధారణంగా మనిషి అన్నాక ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది . దానే ఇంట్రెస్ట్ అని కూడా అంటుంటారు. అయితే అలాంటి పిచ్చి మోజులో డబ్బులను మొత్తం వాటిపై పెట్టేసి
సర్వం కోల్పోయిన స్టార్స్ ఎంతోమంది ఉన్నారు . వాళ్ళల్లో ఒకరే ఎంఎం కీరవాణి తండ్రి శివశక్తి దత్త అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ కీరవాణి , రాజమౌళి పేర్లు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో.. మరి ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆరారార్ సినిమా మరికొద్ది రోజుల్లో ఆస్కార్ అవార్డు అందుకోబోతుంది .ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి కీరవాణి పేర్లు సోషల్ మీడియాలో మారు మ్రోగిపోతున్నాయి.
అయితే ఈ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్న వీళ్ళు ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు . కనీసం ఒక పూట తిండి తినడానికి తిండి కూడా లేకుండా ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయట. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తండ్రి శివశక్తి దత్త గురించి అందరికీ తెలిసిందే. శివశక్తి దత్త విజయేంద్ర ప్రసాద్ వాళ్ళు మొత్తం ఆరుగురు అన్నదమ్ములట . వీళ్ళకి అప్పట్లోనే ఎంతో ఆస్తి ఉంది అని అందరు చెప్పుకుంటూ ఉంటారు . కాగా మొదటి నుంచి కీరవాణి తండ్రి శివశక్తి దత్తకు సినిమాలంటే మహా పిచ్చట . సినిమాల కోసం ఏమైనా చేసే విధంగా అప్పట్లో ఆయన మైండ్ సెట్ ఉండేదట. అప్పట్లో ఆయన ఆలోచన అలా ఉండేటివట . కీరవాణి తండ్రి శివశక్తి దత్త దాదాపు 300 ఎకరాలను భూమి కొనుగోలు చేసి అందరి దగ్గర శభాష్ అనిపించుకున్నారు .
అంతేకాదు ఆ టైంలో రాజులు జమీందారులకి ధీటుగా శివశక్తి ఆస్తులు సంపాదించారని టాక్ వినిపించింది. కాగా అంత కోట్ల ఆస్తిని ఆయనకు ఉన్న సినిమాల పిచ్చితో మొత్తం పోగొట్టుకున్నారట. సినిమాల మీద ఉండే పిచ్చితో తుంగభద్ర వైపు కుటుంబం మొత్తం వలస వెళ్లారట. ఇక ఆ క్రమంలోనే సినిమాలు మీద ఉన్న మోజుతో ఆయన సంపాదించిన సుమారు 300 ఎకరాలు భూమిని.. అంతేకాకుండా ఆయన సంపాదించిన ఆస్తిని మొత్తం సర్వనాశనం చేసేసుకున్నాడట .
ఆ తర్వాత చిన్నగా మెద్రాస్ వచ్చి సెటిల్ అయ్యారు . ఇక ఆ తర్వాత వాళ్ళు లైఫ్ ని లో ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నో కష్టాలు పడ్డారు అంటూ తెలుస్తుంది. ఒకానొక టైంలో కనీసం తిండి కూడా తినడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నారట . ఈరోజు తిండి దొరికితే రేపు తిండి దొరుకుతుందో లేదో అని ఆలోచించుకునే వారట . అలాంటి పొజిషన్ నుండి కుటుంబాన్ని బయటపడేసింది కీరవాణి అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూ ఆయన చెప్పుకొచ్చారు .
అంతేకాదు ప్రెసెంట్ రాజమౌళి ఈ స్థాయిలో ఉండడానికి కూడా కీరవాణి దయ అంటూ అందరూ చెప్పుకొస్తున్నారు. దీంతో కీరవాణి మంచి మనసుకి జనాలు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అంతేకాదు కచ్చితంగా ఆరారార్ సినిమాకి ఆస్కార్డు రావాలని మరెన్నో విజయాలను అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు జనాలు..!!