Moviesపెళ్లి చేసుకుంటానని ఛార్మికి అలాంటి మెసేజ్‌లు చేశాడా.. నరకం చూపించాడా...!

పెళ్లి చేసుకుంటానని ఛార్మికి అలాంటి మెసేజ్‌లు చేశాడా.. నరకం చూపించాడా…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా, నిర్మాతగా విజయవంతంగా కెరీర్ కొనసాగించి ప్రశంసలు అందుకున్న సెలబ్రిటీలలో ఛార్మీ కౌర్ ఒకరు. లైగర్ సినిమా ఫ్లాప్ తర్వాత కొంతకాలం పాటు ఛార్మి సినీ నిర్మాణానికి దూరంగా ఉన్నారు. మరోవైపు ఛార్మి పెళ్లి చేసుకోకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఛార్మి వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలను సైతం ఆమె పట్టించుకోవడం లేదు.

ఒక మ్యూజిక్ డైరెక్టర్ తో ఛార్మి ప్రేమలో ఉన్నారని, ఒక దర్శకుడితో ఛార్మి సన్నిహితంగా మెలిగారని వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. అయితే ఛార్మి ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. స్ట్రేంజర్ తో వెళ్లి మాట్లాడటం అంటే నా వల్ల కాదని ఆమె కామెంట్లు చేశారు. బాధ్యతలు తీసుకోవాలంటే నేను భయపడతానని ఆమె చెప్పుకొచ్చారు.

13 ఏళ్లకే నటిగా కెరీర్ ను మొదలుపెట్టానని ఛార్మి చెప్పుకొచ్చారు. అన్ని రకాల సినిమాలు చూస్తానని విదేశీ భాషల సినిమాలను కూడా చూస్తానని ఛార్మి తెలిపారు. ఓల్డ్ ఇంగ్లీష్ బ్లాక్ అండ్ వైట్ సినిమాలను చూడటం కూడా నాకు ఇష్టమని ఛార్మి చెప్పుకొచ్చారు. నా మెయిల్స్, ఫ్యాన్స్ మెయిల్స్ నేనే చెక్ చేస్తానని ఆమె కామెంట్లు చేశారు. చెత్త కామెంట్లతో వచ్చే కొన్ని మెయిల్స్ నాకు నచ్చవని ఆమె పేర్కొన్నారు.

మంచి మెయిల్స్ కు నేను కచ్చితంగా రిప్లై ఇస్తానని ఆయన తెలిపారు. ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవాలని సెర్చ్ చూస్తూ నాలాంటి హెయిర్ ఉన్న భార్య కావాలని మెయిల్ లో చెప్పాడని ఆమె పేర్కొన్నారు. ఆ వ్యక్తి కామెంట్ కు మంచి మనస్సు ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని నేను సూచించానని ఛార్మి అన్నారు. అదే సమయంలో మెయిల్స్ లో వచ్చే బ్యాడ్ మెసేజ్ ల వల్ల ఇబ్బందులు పడుతూ నరకం చూశానని ఛార్మి పరోక్షంగా కామెంట్లు చేశారు. ఈ జనరేషన్ ప్రేక్షకుల్లో సైతం ఛార్మికి ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news