సినిమా ఇండస్ట్రీలో లవ్, డేటింగ్, ఎఫైర్లు, విడాకులు చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటాయి .. వినిపిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ ప్రేమించుకున్న అన్ని నాళ్లు కూడా పెళ్లి చేసుకుని కాపురాలు చేయకుండా డివర్స్ తీసుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత-నాగచైతన్య కూడా అదే లిస్ట్ లోకి వస్తారు. వీళ్లు డీవర్స్ తీసుకుని సంవత్సరం గడిచినా .. ఇప్పటికి సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన న్యూస్ లు వైరల్ అవుతూనే ఉంటాయి.
కాగా రీసెంట్గా అలా విడాకులు తీసుకున్న డైరెక్టర్ బిగ్ బాంబ్ పేల్చాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సెల్వరాఘవన్ తాను విడాకులు తీసుకోవడానికి కారణాలు ఏంటో ఓపెన్ గా మీడియాకి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తన తమ్ముడి కారణంగానే ఇప్పుడు నేను ఇంత హ్యాపీగా లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నాను అంటూ చెప్పి కోలీవుడ్ మీడియాకు షాక్ ఇచ్చారు సెల్వరాఘవన్. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సెల్వరాఘవన్.. 7/G బృందావన కాలనీ సినిమాతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అనే సినిమాను డైరెక్ట్ చేసి మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు.
కాగా 7/G బృందావన కాలనీలో హీరోయిన్ గా నటించిన సోనియా అగర్వాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈయన.. కొన్నాళ్లకే డివర్స్ ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్నారు. కాగా వ్యక్తిగత కారణాల వల్ల మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నామని చెప్పిన సెల్వరాఘవన్.. ఆ టైంలో నేను బాగా డిప్రెషన్ కి లోనయ్యానని.. అప్పుడు నా తమ్ముడే నాకు అండగా నిలిచాడాడని చెప్పుకొచ్చాడు . అంతేకాదు “నీకంటూ ఓ లైఫ్ ఉంది ..నీకంటూ టైం వస్తుంది .. అప్పటివరకు వెయిట్ చెయ్” అంటూ సజీషన్ ఇచ్చాడని.. ఆ కారణంగానే నా లైఫ్ లో రెండో పెళ్లి జరిగింది” అంటూ చెప్పుకొచ్చాడు . అంతేకాదు ఆ రోజు నా తమ్ముడు నాకు ఆ సజీషన్ ఇవ్వక పోయి ఉంటే ..డైరెక్టర్ సెల్వ రాఘవన్ అనే వాడే ఉండేవాడు కాదని ..చెప్పుకు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా డివర్స్ తీసుకున్న ధనుష్ కూడా త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!