టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఎక్కడున్నారు ? అన్న ప్రశ్నకు ఆన్సర్లు ముంబైలో అని మాత్రమే వినిపిస్తున్నాయి. పూరి ముంబైలో ఉండటం పాయింట్ కాదు.. అసలు ఆయన అక్కడ ఏం చేస్తున్నారన్నదే మెయిన్. సరైన స్క్రిప్ట్ దొరికితే చాలు పూరి ఎంత పెద్ద స్టార్ హీరో అయినా చక చక మూడు నెలల్లో సినిమా తీసి అవతల పడేస్తారు. ఎంత పెద్ద బడ్జెట్ సినిమా అయినా పూరికి మూడు నెలలు సరిపోతుంది. అందుకే ఏడాదికి మూడు నాలుగు సినిమాలు కూడా తీసే సత్తా పూరికి ఉంది.
వరుస ప్లాపులు తర్వాత రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ సినిమా తీశారు. ఆ సినిమాకు మంచి లాభాలు వచ్చాయి. అదే ఓవర్ కాన్ఫిడెన్స్ పూరిని దెబ్బ కొట్టింది. వెంటనే విజయ్ దేవరకొండ తో లైగర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమా అంటూ పెద్ద హడావిడి చేస్తే అది డిజాస్టర్ అయింది. దీంతో ఫైనాన్షియల్ గొడవలు.. పోలీసులకు కంప్లైంట్లతో పూరి చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ సినిమా తర్వాత విజయ్ తో మొదలుపెట్టిన జనగణమన మధ్యలోనే ఆపేశారు.
అంటే పూరి దెబ్బ ఎలా ఉందో ? రుచి చూసిన విజయ్ దేవరకొండ దండం పెట్టేసినట్టు ఉన్నాడు. లైగర్ తర్వాత మెగాస్టార్ తో సినిమా ఉంటుందని పూరీ నానా హడావుడి చేశాడు. ఆ మాటకు వస్తే చిరు రీ ఎంట్రీ సినిమాకే పూరి దర్శకత్వం వహించాల్సి ఉంది. ఆటోజానీ టైటిల్ తో పూరి చేసిన హడావుడి మామూలుగా లేదు. అయితే పూరీ చెప్పిన కథ చిరుకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో చిరు పూరిని లైట్ తీసుకున్నారు. అలాంటిది ఇప్పుడు లైగర్ లాంటి భయంకరమైన డిజాస్టర్ తర్వాత మాత్రం ఎందుకు ఛాన్స్ ఇస్తారు.
మధ్యలో బాలయ్య మంత్రం కూడా పూరి జపించాడు. బాలయ్య వరుసగా బిజీగా ఉన్నాడు. పైగా వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే చిరంజీవి భోళా శంకర్ సినిమా తర్వాత సరైన డైరెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. పూరికి ఇది మంచి అవకాశం.. అయితే చిరు నోటి నుంచి పూరీ పేరే బయటకు రావడం లేదు. జనాలు మరిచిపోయిన వివి వినాయక్ లాంటి పాత చింతకాయ పచ్చడి డైరెక్టర్ పేరు కూడా వినిపిస్తోంది. దీనిని బట్టి పూరీని టాలీవుడ్ హీరోలు ఎవరు దగ్గరకు కూడా రానివ్వటం లేదని అర్థమవుతోంది. మరి కొన్నాళ్లపాటు పూరికి ఈ బాధలు తప్పేలా లేవు. ఏదేమైనా ఇంత గొప్ప డైరెక్టర్ కు ఇది అవమానంగానే భావించాలి.