తెలుగు సినీ ఇండస్ట్రీలో అనేక గ్యాసిప్లు వస్తుంటాయి.. పోతుంటాయి. అదిగో ఆ హీరోయిన్.. ఇడిగో హీరో.. అంటూ.. అనేక గ్యాసిప్లు హల్చల్ చేయడం తెలిసిందే. అయితే.. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి గ్యాసిప్లు హోరెత్తిపోయిన ఏకైక హీరో ఎవరైనా ఉన్నారా అంటే.. అది చిరంజీవి అనే చెప్పాలి. ఒకప్పు డు అన్నగారు అయితే.. తర్వాత బాధితుడు చిరంజీవేనని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.
రెండు దశాబ్దాల పాటు చిరంజీవి ప్రభ వెలిగిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన పక్కన ఎక్కువగా నటించిన హీరోయిన్లు మాధవి. రాధ. వీరిద్దరితో చిరంజీవి కాంబినేషన్ అదరహో.. అనేది తెలి సిందే. అయితే..అదే సమయంలో వీరితో చిరుకు ప్రేమాయణం సాగుతోందని.. కలిసి ఉన్నారని.. పెద్ద ఎత్తున గ్యాసిప్స్ వచ్చాయి. ఒకరోజు కాదు. వారం కాదు.. దాదాపు దశాబ్దం పాటు ఈ గ్యాసిప్స్ ఠారెత్తిపోయా యి.
అయితే, మృదుభాషి కావడంతో చిరు వాటిని లైట్ తీసుకునేవారు. కానీ, ఇండస్ట్రీ పెద్దలు కూడా..చిరు విషయాలపై కొన్ని పత్రికలు లీకులు ఇచ్చేవారనే టాక్ ఉండేది. ఏదో చిన్న చిన్న మనస్ఫర్థలు ఉండ డంతో వారంతా కూడా చిరుకు యాంటీగా గ్యాసిప్స్ను ప్రోత్సహించారు. ఒకానొక దశలో చిరు.. కుటుం బంలోనూ కూడా ఈగ్యాసిప్స్ మంటలు రేపాయి. చిరు భార్య సురేఖ ఈ వార్తలు చూసి హర్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయట. అంతేకాదు చిరంజీవి..రాధిక తో కూడా ఎఫైర్ నడిపాడు అన్న వార్తలు వినిపించాయి..!!
దీంతో ఈ వివాదాల నుంచి బయట పడేందుకు.. కుటుంబం మొత్తాన్ని కూడా.. షూటింగ్ స్పాట్లకు చిరు తీసుకువెళ్లిన సందర్భాలు ఉన్నాయని..ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉన్న విజయబాపినీడు చెప్పేవారు. తర్వాత తర్వాత.. అల్లూ రామలింగయ్య జోక్యం చేసుకుని.. గ్యాసిప్స్ అమ్మా.. వీటిని నమ్మకూడదు.. అనివారించేవారట. చాలా రోజులు చిరు ఈ గ్యాసిప్స్తో బాధపడ్డారని ఇండస్ట్రీలో ఇప్పటికీ చర్చించుకుంటారు. అందుకే.. చిరంజీవి సినిమా పత్రికలను చదవరట.