ఎస్ ..ప్రెసెంట్ ఇదే న్యూస్ గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగి పోతుంది. మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు. మనకు తెలిసిందే మెగా బ్రదర్ నాగబాబు వన్ అండ్ ఓన్లీ డాటర్ నీహారిక ఎంత అల్లరి పిల్ల అనేది. బోలెడు మంది మెగా హీరోలు ఉన్నా..ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నిహారిక చాలా చలాకీగా ..అల్లరిగా యాక్టివ్గా ఉంటుంది.
ఈమెతో ఫ్రెండ్షిప్ చేసిన ప్రతి ఒక్కరు ఆ క్రేజీ ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తారు . అంతలా ఎటువంటి కల్మషం లేకుండా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంది నిహారిక . కాగ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ట్ డాటర్స్ సోషల్ మీడియాలో ఉన్నా.. నిహారిక కు ఉన్న క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు అనే చెప్పాలి . ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చి సెటిల్ అవుదామని అనుకున్న నిహారిక కళలు డిజాస్టర్ గా మారాయి. ఈ క్రమంలోనే ఇంట్లో పెద్దలు చెప్పిన సంబంధాన్ని పెళ్లి చేసుకున్న నిహారిక ..త్వరలోనే విడాకులు తీసుకోబోతుంది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది .
దానికి మెయిన్ రీజన్ నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య తన సోషల్ మీడియా ఖాతాలో పెళ్లి ఫోటోలను డిలిట్ చేయడమే కారణమంటూ తెలుస్తుంది. నిహరిక ను అన్ ఫాలో కూడా చేసేసాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . కాగా కొద్ది రోజులుగా నిహారిక ..చైతన్య గురించి కానీ.. చైతన్య, నిహారిక గురించి కానీ ఎక్కడ ప్రస్తావించట్లేదు. ఈ క్రమంలోని ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని ..ఫ్యామిలీ సర్దుబాటు చేస్తుందని ..త్వరలోనే ఈ జంట మళ్ళీ కలుస్తారు అనుకున్నారు. కానీ ఇలా విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని ఫ్యాన్స్ కూడా ఉంచలేకపోయారు.
అయితే దీనిపై ఇప్పటివరకు అటు మెగా ఫ్యామిలీ కాని.. ఇటు జొన్నలగడ్డ ఫ్యామిలీ కాని అఫీషియల్ గా స్పందించలేదు . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇది ఒక ట్రెండ్ గా మారిపోయింది. విడాకులు తీసుకునే ముందు ఇంటి పేరుని మార్చేస్తూ.. పెళ్లికి సంబంధించిన ఫోటోలను డిలీట్ చేస్తూ ..విడాకులు తీసుకోబోతున్నాం అంటూ హింట్ ఇచ్చేస్తున్నారు స్టార్ సెలబ్రిటిస్. గతంలో నాగచైతన్య , సమంత ,ధనుష్ లాంటి వాళ్ళు ఇలానే చేశారు . కాగా ఇదే క్రమంలో చైతన్య కూడా తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో అందరూ ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారా ..? అంటూ బాధ పడిపోతున్నారు. మెగా ఫాన్స్ అయితే వద్దు నిహారిక ..చైతన్య చాలా మంచివాడు అంటూ విడాకులు తీసుకోవద్దని సజిస్ట్ చేస్తున్నారు . చూద్దాం మరి ఈ న్యూస్ పై మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో..?