ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప సినిమా దెబ్బకు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బన్నీ సినిమా వస్తుందంటే కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు.. సౌత్ ఇండియన్ సినీ అభిమానులతో పాటు అటు బాలీవుడ్ వాళ్లు కూడా ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2021 డిసెంబర్లో వచ్చింది. మధ్యలో 2022 అయిపోయింది. కనీసం 2023లో అయినా పుష్ప 2 వస్తుందన్న గ్యారెంటీ అయితే లేదు
పుష్ప 2ను కూడా రు. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. పుష్పకు సీక్వెల్‌గా వస్తుండడంతో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారే మేకర్స్. ఇక పుష్ప 2 తర్వాత 2024లో బన్నీ – త్రివిక్రమ్ సినిమా ఉంటుంది.. ఆ తర్వాత 2025లో సందీప్‌రెడ్డి వంగ సినిమా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో.. రాజు ఎవరో ? రెడ్డి ఎవరో చెప్పలేం.
ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. దిల్ రాజు బ్యానర్లో బన్నీ – వేణు శ్రీరామ్ ( వకీల్‌సాబ్) దర్శకుడి కాంబోలో ఐకాన్ సినిమా ఉంటుందని ప్రకటించి నాలుగేళ్లు అవుతోంది. ఈ ఐకాన్ నాలుగేళ్ల నుంచి వార్తల్లో ఉంటోంది. బన్నీ ఇప్పుడు చేస్తోన్న సినిమా పూర్తయిన వెంటనే ఐకాన్ సెట్స్ మీదకు వెళ్లిపోతుందని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం.. ఐకాన్ క్యాన్సిల్ అయిపోనట్టుగా తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయితే నిర్మాత దిల్ రాజుకు వచ్చిన నష్టం లేదు. ఆయన చాలా సినిమాలు చేసుకుంటాడు. ఇటు బన్నీ కూడా వరుస పెట్టి స్టార్ డైరెక్టర్లతో సినిమాలు సెట్ చేసుకుంటాడు. అయితే ఈ ప్రాజెక్టు కోసమే ఏకంగా మూడేళ్ల పాటు కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా ఉండదు అని డిసైడ్ అయ్యే వేణు శ్రీరామ్ నానితో పాటు తమిళ హీరోల వైపు చూస్తున్నాడని తెలుస్తోంది.
బన్నీ ఖాళీ అవ్వాలంటే అది 2026లోనే.. అప్పటి వరకు వేణు శ్రీరామ్ ఖాళీగా ఉండలేడు. ఇప్పటికే మూడేళ్లకు పైగా టైం వేస్ట్ అయిపోయింది. అందుకే ఈ సినిమా ఇక లేనట్టే అని.. ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు..!