Moviesబిగ్ బ్రేకింగ్: ఫైనల్లీ.. ఫ్యాన్స్ కళ నెరవేరబోతుందోచ్.. పెళ్లి పై ప్రభాస్...

బిగ్ బ్రేకింగ్: ఫైనల్లీ.. ఫ్యాన్స్ కళ నెరవేరబోతుందోచ్.. పెళ్లి పై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్..!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న రెబల్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈశ్వర్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చూస్తున్నాడు . బాహుబలి సినిమా తర్వాత తన పేరుని ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయే విధంగా మార్చుకున్న ప్రభాస్ ప్రెసెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్.. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్టుకె.. మారుతి డైరెక్షన్లో రాజా డీలక్స్ చేస్తున్నారు . ఈ మూడు సినిమాలు కంప్లీట్ అవ్వగానే.. అర్జున్ రెడ్డి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ అనే సినిమాలో కూడా నటించబోతున్నాడు .

ఇదే కాదు మరో రెండు మూడు బిగ్ ప్రాజెక్ట్స్ ని కూడా లైన్లో పెట్టుకొని ఉన్నాడు ప్రభాస్ . కాగా సినిమాల పరంగా అభిమానులను సాటిస్ఫై చేస్తున్న ప్రభాస్ ..ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనేది సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది . కాగా రీసెంట్గా మీడియా రీకంట పడిన ప్రభాస్ తన పెళ్లిపై కీలక అప్డేట్ ఇచ్చారు . జనరల్ గా ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వని ప్రభాస్.. రీసెంట్ గా మీడియా కంటే కనపడ్డారు . ఈ క్రమంలోనే మిడియా ప్రతినిధులు ప్రభాస్ పెళ్లెప్పుడు అంటూ అడగ్గా కూసింత అసహనంగానే తన పెళ్లి పై మాట్లాడారు.

“నేను పెళ్లి చేసుకుంటాను .. నా పెళ్లి గురించి నాకంటే మా అమ్మ కంటే మీరే ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు ఉన్నారు . నాకు పెళ్లి చేసుకోవాలి అని అనిపించినప్పుడు అందరికీ చెప్పే చేసుకుంటారు. సోషల్ మీడియాలో వచ్చేటివి ఏవి నమ్మకండి. ప్రతిసారి ఇలా నా పెళ్లి గురించి అందరూ అడుగుతూ ఉంటే చిరాకు వస్తుంది. నా పెళ్లి ఫిక్స్ అయితే నేనే నా పెళ్లి గురించి ప్రకటిస్తాను “అంటూ చెప్పుకొచ్చాడు .

ఈ క్రమంలోనే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా లేదా అన్న డౌట్లు వ్యక్తం చేసిన ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు . ప్రభాస్ పెళ్లయితే చేసుకుంటాడు కానీ ఎప్పుడు చేసుకుంటాడో తెలియదు అంటూ క్లారిటీకి వచ్చేశారు . దీంతో మరోసారి టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా కొంతకాలం నుంచి హీరోయిన్ అనుష్క శెట్టితో ప్రభాస్ ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి . దీనిపై ఇద్దరు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. చూడాలి లాస్ట్ కి మన హీరో ఎవరిని చేసుకుంటాడో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news