నటరత్న నందమూరి బాలకృష్ణకు సినిమా అంటే ఎంతో ప్రాణం. ఆయన సినిమా కోసం కుటుంబాన్ని ప్రణాన్ని సైతం పణంగా పెట్టిస్తూ ఉంటారు. ఒక్కసారి కథ విన్నాక సినిమా చేస్తానని మాట ఇచ్చారంటే ఆ తర్వాత ఆయనకు ఏవి కనపడవు.. ఏ విషయాన్ని పట్టించుకోరు. ఎక్కడ వేలు పెట్టి జోక్యం చేసుకోరు.. ఆ సినిమా పూర్తయింతవరకు దర్శకుడు ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ విషయంలో బాలయ్యకు టాలీవుడ్ లో సరితూగే హీరో ఎవరు లేరు.
ఇక బాలయ్య కు ముందు నుంచి దర్శకత్వం చేపట్టాలన్న కోరిక ఎక్కువగా ఉండేది. ఈ విషయంలో రెండు మూడు ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే బాలయ్య దురదృష్టం ఎంటో గాని అవేవీ ఫలించలేదు. మహానటి సౌందర్య జీవించి ఉన్నప్పుడు ఆమెను ద్రౌపదిగా పెట్టి నర్తనశాల సినిమాను ప్లాన్ చేశారు. రెండు షెడ్యూల్స్ షూటింగ్ జరిగాక సౌందర్య హఠాన్మరణంతో ఆ సినిమా ఆగిపోయింది.
ఈ సినిమాకు కథ, దర్శకత్వం బాలయ్య స్వీకరించారు. అయితే నర్తనశాల కంటే ముందే మరో రెండు సార్లు కూడా బాలయ్య దర్శకత్వం చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లు పడినప్పుడు బాలయ్య తన దర్శకత్వంలోనే ఒక సినిమా చేయాలని అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అది ఆగిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన సామ్రాట్ అశోక సినిమాను ముందు బాలయ్య తన దర్శకత్వంలోనే తెరకెక్కించాలని అనుకున్నారు.
ఈ సినిమాను డైరెక్ట్ చేసేందుకు బాలయ్య ఏకంగా ఎన్టీఆర్ తోనే గొడవ పడ్డారట. ఈ విషయాన్ని అన్ ష్టాపబుల్ రాజమౌళి షోలో బాలయ్య స్వయంగా చెప్పారు. ఈ సినిమా కథ రెడీ అయ్యాక తనకు ఏమేం కావాలో ఎన్టీఆర్ తో చెప్పటం ప్రారంభించారట బాలయ్య. ఈ సినిమాను 70mm లో తెరకెక్కించాలని అనుకున్నానని.. క్లైమాక్స్లో 10,000 మంది కావాలని అంటే ఎన్టీఆర్ వెటకారంగా హా ఇంకేం కావాలని అనడంతో బాలయ్యకు పట్టరాని కోపం వచ్చేసిందట.
తర్వాత 2000 గుర్రాలు, 200 ఒంటెలు కూడా కావాలండి అంటే ఎన్టీఆర్ బాలయ్య వైపు చూసి నవ్వారట. దీంతో పదేపదే తనకు ఎన్టీఆర్ అడ్డు వస్తుండడంతో ఆయనకు కోపం వచ్చి స్క్రిప్ట్ నేలకేసి కొట్టి.. తాను సినిమా చేయడం లేదని వచ్చేసానని తెలిపాడు బాలయ్య. ఆ తర్వాత ఎన్టీఆర్ స్వయంగా ఈ సినిమాను డైరెక్ట్ చేసుకున్నారు. అయితే సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. ఏదేమైనా సినిమా విషయంలో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ తోనే ఇంతలా విభేదించారు.