నటరత్న ఎన్టీఆర్ నట వారసుడుగా తాతమ్మకల సినిమాతో బాలయ్య తొలిసారిగా వెండితెరపై కనిపించారు. ఈ సినిమాకు ఎన్టీఆర్ దర్శకుడు. ఆ తర్వాత బాలయ్య పదికి పైగా సినిమాలలో నటించిన సోలో హీరోగా సరైన కమర్షియల్ హిట్ పడలేదు. ఎన్టీఆర్ కు కూడా తన కొడుకు స్టార్ హీరో కాలేకపోయాడే అన్న ఫీల్ ఎక్కడో ఉండేది. అప్పటికే ఎన్టీఆర్ రాజకీయాలొకి వచ్చి రెండుసార్లు సీఎం కూడా అయ్యారు. బాలయ్యకు బలమైన ఎన్టీఆర్ లెగసి కనిపిస్తున్న ఆ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ లు పడలేదు. ఆ కొరత తీర్చేసిన సినిమా మంగమ్మగారి మనవడు.
ఆ సినిమా వచ్చాక బాలయ్య – కోడి రామకృష్ణ కాంబినేషన్కు మంచి క్రేజ్ వచ్చేసింది. అలా వీరిద్దరి కాంబినేషన్లో 1989లో తెరకెక్కిన సినిమా ముద్దుల మామయ్య. ఈ సినిమా ఆ ఏడాది టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసింది. బాలయ్య – విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించగా సీత బాలయ్య చెల్లి పాత్రలో నటించింది. బాక్సాఫీస్ వద్ద ముద్దుల మామయ్య వసూళ్ల వర్షం కురిపించడంతో పాటు 1989లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.
అలాగే బాలయ్యను టాప్ హీరోల లీగ్ లో చేర్చడంతో పాటు అతనికి యువరత్న అనే బిరుదు కూడా ఈ సినిమా వల్లే దక్కింది. ముఖ్యంగా ఈ సినిమాలో చెల్లి సెంటిమెంట్ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రజలను.. ముఖ్యంగా మహిళా ప్రాక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. థియేటర్లో నుంచి చాలామంది కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకు వచ్చేవారు. అన్న చెల్లెల సెంటిమెంట్ అంతగా పండింది.
ఈ సినిమా ముందుగా తమిళంలో ఎన్ తంగచి పడి చావకి సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ఆ తర్వాత హిందీలో ఆజ్ కా అర్జున్ గా, కన్నడం లో రవిమామ గాను, బెంగాలిలో పవిత్ర పాపి గాను రీమేక్ చేయగా అని భాషలలోను సూపర్ హిట్ గా నిలిచింది. ఇలా బాలయ్య నటించిన సినిమా ఐదు భాషల్లో తెరకెక్కి ఐదు చోట్ల కూడా సూపర్ హిట్ అవడం విశేషం.
ఈ సినిమాలో నేనే రాజా.. కులాసా నాది, మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు అన్న పాఠకులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తర్వాత బాలయ్యకు ఐదు ఆరు సంవత్సరాల పాటు వరుసగా ప్రతి ఏటా ఒక సూపర్ హిట్ పడుతూ ఉండడంతో ఆయనకి తిరుగులేకుండా పోయింది.