సినిమా రంగంలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి హిట్టు లేదా ప్లాప్ కొట్టడం కామన్ గా జరుగుతూ వస్తుంది. ఒక హీరో చేయాల్సిన హిట్ సినిమా మరో హీరో చేతుల్లోకి వెళితే ముందు ఆ కథ వదులుకున్న హీరో బాధపడుతూ ఉండటం మామూలే. ఇది ఇలా ఉంటే సీనియర్ ఎన్టీఆర్ తన కొడుకు బాలకృష్ణ కొట్టాల్సిన ఒక బ్లాక్ బస్టర్ సినిమాను ఆయనే స్వయంగా లాగేసుకున్నారు. ఇది కాస్త ఇంట్రెస్టింగ్ స్టోరీయే.
పల్లవి ఫిలిం అధినేత వెంకటరత్నం ఎన్టీఆర్కు దూరపు బంధువు. ఆయన డివి నరసరాజు ఆధ్వర్యంలో ఒక కథ రెడీ చేయించుకున్నారు. శోభన్ బాబు హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. హీరోయిన్లుగా జయప్రద, జయసుధలను తీసుకున్నారు. రాజ్ కుమార్ హీరోగా కన్నడలో సూపర్ హిట్ అయిన గంధద గుడి సినిమా కథను కొద్దిగా మార్పులు చేసి కథను రాసుకున్నారు. శోభన్ బాబు తాను ఈ సినిమాలో నటించడం లేదని చెప్పడంతో చివరకు వారు ఎన్టీఆర్ ను సంప్రదించారు.
ఎన్టీఆర్ ఓకే చెప్పారు. రాఘవేంద్రరావు దర్శకుడుఎన్టీఆర్కు కథ చెప్పి ఎన్టీఆర్ను యముడిగా.. యువ హీరోగా బాలకృష్ణను నటింప చేద్దామని రచయిత నరసరాజు రిక్వెస్ట్ చేశారు. అయితే ఎన్టీఆర్ తానే హీరోగా వేస్తానని… యముడుగా సత్యనారాయణను పెట్టమని చెప్పారు. అలా తయారైంది యమగోల సినిమా. కంప్లీట్ కామెడీ సినిమాగా తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది. పలు కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. అసలు బరువైన సెంటిమెంట్ పాత్రలు లేకుండా కంప్లీట్ గా వినోదభరితంగా ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ గెటప్పుతో పాటు సెటప్ అన్ని మారిపోయాయి. ఈ సినిమా వచ్చాక మరో 10 ఏళ్ల వరకు ఆయన రాజకీయాల్లోకి వెళ్లి వరకు తిరుగులేని నెంబర్ వన్ హీరోగా కొనసాగారు. విచిత్రం ఏంటంటే ఎన్నికలకు ముందు రిలీజ్ అయిన ఎన్టీఆర్ నాదేశం సినిమాకు కూడా పల్లవి ఫిలిమ్స్ అధినేత వెంకటరత్నం నిర్మాత కావటం విశేషం. ఈ సినిమాకు కే బాపయ్య దర్శకత్వం వహించారు. అలా బాలయ్య కొట్టాల్సిన మంచి హిట్ సినిమా ఎన్టీఆర్ లాగేసుకున్నారు.