నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ఆయన చాలా కోపంగా ఉంటారని ఎవరు ఏ తప్పుచేసినా కేకలు వేస్తారని ప్రచారం బాగా జరిగేది. బాలయ్యపై గత కొనేళ్ళుగా నడుస్తున్న ప్రచారం అంత ఒక్క సారిగా ఆయన అన్ స్టాపబుల్ షో తో మారిపోయింది. అన్ స్టాపబుల్ షో లో బాలయ్యను చూసిన వారంతా అసలు బాలయ్య వేరు,పైకి కనిపించే బాలయ్య వేరు అని చెప్తున్నారు. వాస్తవంగా బాలయ్య తన వృత్తి పరంగా చాలా కేర్ గా ఉంటారు. షూటింగ్ లో చాలా సీరియస్ గా ఉంటారు. సినిమా అనేది కొని కోట్ల ప్రాజెక్ట్.
నిర్మాత తన సర్వస్వం అంతా ఆ సినిమా మీదే పెడతారు. అందుకే సినిమా తేడా వస్తే నిర్మాత కోట్లాది రూపాయలు నష్ట పోవాల్సి ఉంటుంది. అందుకే సినిమా షూటింగ్ జరుగుతున్నపుడు చాలా సీరియస్ గా ఉంటారని.. ఎక్కడ సిల్లీ థింక్ ఉండదని ఆయన గురించి చెప్తు ఉంటారు. అది వాస్తవం కూడా.. ! తన పాత్రలో లీనం అయేటపుడు ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా చూసుకుంటాడు. అవేవి తెలియని చాలా మంది బాలయ్య కోపంగా ఉంటారని.. చీటికి మాటికి చెయి చేసుకుంటు ఉంటారని ప్రచారం చేసుకూంటు వచ్చారు.
అన్ స్టాపబుల్ షోతో అవి అన్నీ పటాపంచలు అయ్యాయి. నిజమైన బాలయ్య ఎలా ఉంటారో అందరికి తెలిసి వచ్చింది. ఇక బాలయ్యకు జోడిగా సీనియర్ నటి లయ ఒక సినిమాలో నట్టించారు. లయ అచ్చ తెలుగు అమాయి.. ఆమె స్వస్థలం విజయవాడ. ఆమె విజయవాడలోని నలందా కాలేజీ లొ చదివారు.
తెలుగులో ఒక మంచి హీరోయిన్‌గా ఎదిగారు. బాలయ్య కు జోడిగా విజయేంద్రవర్మ సినిమాలో నటించారు.
స్వర్ణ సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 2004 డిసెంబర్ 15న రిలీజ్ అయింది. ఈసినిమాలో లయ, అంకిత, సంగీత, టబు, శ్రేయ కూడ నటించారు. ఈ సినిమాలో ముందు లయ, బాలయ్య మధ్య ముందుగా ఒక పాటను షుట్ చేస్తున్నారట. లయ ఒక స్టెప్ ను కాలుని.. ముందుకి వెనక్కి కదుపుతు ప్రాక్టీస్ చేస్తుందట. లయ వెనుకాల బాలయ్య ఉన్నారట.. బాలయ్యను లయ చూసుకోకుండా కాలు తొక్కేసిందట.
వెంటనే బాలయ్య కేకలు వేసి నా కాలే తొక్కుతావా ? అని సీరియస్ అయారట. వెంటనే లయ సారీ సార్ అని బాలయ్యకు చెప్తున్నా సరే వినిపించుకోకుండ కోపంగానే ఉన్నారట. ఆయన ఏం చేస్తారో అని లయ ఒక సారిగా టెన్షన్ పడిపోతు ఉందట.. కంటి వెంట నీళ్ళు కూడా వచ్చేశాయట. ఆ తర్వాత బాలయ్య ఆమె వద్దకు వెళ్లి ఇదంత సరదాగా నిన్ను ఆట పట్టించడానికి అని చెప్పడంతో ఊపిరి పీల్చుకుందట. బాలయ్యది చిన్న పిల్లల మనస్తత్వం అని .. లోపల ఏం ఉంచుకోకుండా మాట్లడేస్తారని ఆమె ప్రసంసలతో ముంచెత్తింది.