ఆలిండియా నెంబర్ 1 హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని 1990ల దశకంలో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన.. మహా నటి శ్రీదేవి. ఆమెకు ఎలాంటి అవార్డులు రాకపోయినా.. ప్రజలు ఇచ్చిన అవార్డులు.. రివార్డులు మాత్రం ఎక్కువనే చెప్పాలి. అయితే.. తెలుగులో ఉన్న అప్పటి హీరోయిన్లలో కొందరు జయప్రద, జయసుధ వంటివారు.. బాలీవుడ్‌కు వెళ్లినా.. శ్రీదేవి రేంజ్‌లో మాత్రం పుంజుకోలేక పోయారు.
ముఖ్యంగా జయసుధ అయితే.. వెంటనే తిరిగి చెన్నై వచ్చేశారు. దీనికి కారణం.. బాలీవుడ్ వాతావరణం తనకు పడలేదని చెప్పడమే. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని జయసుధ చెప్పేవారు. అయితే జయసుధ క్యాస్టింగ్ కౌచ్ బాధలు పడలేక తిరిగి టాలీవుడ్‌కు వచ్చేశారు. అయితే శ్రీదేవికి ఈ బాధలు తప్పలేదు. అప్పట్లో బాలీవుడ్ దర్శక నిర్మాతలు శ్రీదేవికి ఇలా టార్చర్ పెట్టారట.
అయితే వీటిని సమర్ధవంతంగా ఎదుర్కొన్న నటి శ్రీదేవి. ఆమె కేవలం టాలెంట్‌నే నమ్ముకున్నారు. ప్రజలే ఆమెను కోరుకోవడంతో ఆమె ముందు ఆమెను వాడుకోవాలనుకు వాళ్ల పప్పులు ఉడకలేదు. కానీ, ఈమెకు కూడా బాలీవుడ్‌లో అవకాశాలు అంత తేలికగా అయితే రాలేదనే చెప్పాలి. పదహారేళ్ల వయసు.. వంటి సినిమాలను గమనిస్తే.. శ్రీదేవి తీరు వేరుగా కనిపిస్తుంది.
బండ ముక్కు, బొద్దైన శరీరం వంటివి ఆమె బాలీవుడ్‌లో అడ్డంకిగా మారాయి. దీంతో నిర్మాతలు ముందు గా సినిమాల్లోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సలహా మేరకు.. ఆమె ముక్కుకు ఆపరేషన్ చేయించుకున్నారు. మొత్తంగా ముక్కును కోటేరుగా మార్చుకునేందుకు మొత్తం 21 సార్ల ఆపరేషన్లు చేయించుకున్నట్టు శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తర్వాతే . తనకు బాలీవుడ్‌లో చాన్స్‌లు వచ్చాయని కూడా వివరించారు.
ఈ ఆపరేషన్‌లకు భారీ ఎత్తున ఖర్చు కూడా చేసినట్టు ఆమె వివరించారు. ఆ తర్వాత సన్నబడేందుకు.. అనేక ప్రయోగాలుచేయాల్సి వచ్చిందన్నారు. తనకు ముద్దపప్పు.. ఆవకాయ్ అంటే.. ఇష్టమని.. కానీ, వాటిని వదులుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. కెరీర్ లో ఇవన్నీ కామనేనని సరిపుచ్చుకోవాల్సి వచ్చిందని కూడా శ్రీదేవి చెప్పడం గమనార్హం. సో.. ఇలా.. శ్రీదేవి బాలీవుడ్‌లో నెంబర్ 1 హీరోయిన్ అయిందన్నమాట.