MoviesANR-Nagarjuna ఒకే క‌థ‌తో సినిమాలు తీసి హిట్ కొట్టిన ఏఎన్నార్‌.. నాగార్జున‌.....

ANR-Nagarjuna ఒకే క‌థ‌తో సినిమాలు తీసి హిట్ కొట్టిన ఏఎన్నార్‌.. నాగార్జున‌.. ఆ సినిమా ఇవే…!

సినిమా రంగంలో ఒకే కథతో రెండు మూడు సినిమాలు తెరకెక్కి హిట్లు లేదా ప్లాప్ అవడం చూస్తూనే ఉన్నాం. భారతీయ సినిమా రంగానికి 70-80 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. హీరోలు మారుతున్నారు కొత్తతరం వస్తోంది.. దర్శకులు మారుతున్నారు.. టెక్నాలజీ మారింది. అయినా కథలు మాత్రం కొత్తగా రావడం లేదు. దీంతో పాత కథలనే కాస్త అటు ఇటు మార్చి సినిమాలుగా తీస్తున్నారు. పాత కథలకే కొత్త హంగులు అద్ది ఈతరం ప్రేక్షకుల ముందుకు వదులుతున్నారు. ఒకే కథతో కాస్త అటు ఇటుగా తెరకెక్కి రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి.

వెంకటేష్ ధృవనక్షత్రం, బాలకృష్ణ అశోక చక్రవర్తి సినిమాలు రెండు దాదాపు ఒకే కథాంశంతో తెరకెక్కి ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలలో వెంకటేష్ సినిమా హిట్గా నిలిస్తే.. బాలయ్య సినిమా యావరేజ్ గా నిలిచింది. ఈ రెండు సినిమాలు మలయాళం లో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ఆర్యన్ సినిమాకు రీమేక్గా వచ్చాయి. ఇక విచిత్రం ఏంటంటే అక్కినేని హీరోలు ఏఎన్ఆర్, ఆయన తనయుడు నాగార్జున ఇద్దరు దాదాపు ఒకే కథాంశంతో తెరకెక్కిన రెండు సినిమాలలో నటించి ఇద్దరు హిట్లు కొట్టారు.

నాగార్జున హీరోగా కాట్రగడ్డ మురారి నిర్మాతగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో జానకి రాముడు సినిమా తెరకెక్కింది. 1988లో రిలీజ్ అయిన ఈ సినిమాలో నాగార్జున విజయశాంతి, జీవిత ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకు రైటర్ ఎవరో కాదు బాహుబలి లాంటి దేశం మెచ్చిన సినిమా స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ కావటం విశేషం. ఆయనకు కథా రచయితగా ఇదే తొలి చిత్రం. అయితే ఈ సినిమాపై ఏఎన్ఆర్ నటించిన మూగమనసులు సినిమా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

సినిమా సోల్ అంతా మూగమనసులు చుట్టూనే ఉంటుంది. అయితే కథనం నేపథ్యం కొత్తగా ఉండాలని నిర్మాత మురారి కోరుకోవడంతో విజయేంద్రప్రసాద్ అలాగే కథను మార్చి జానకిరాముడు గా తీర్చిదిద్దారు. జానకిరాముడు సినిమాను స్పష్టంగా గమనిస్తే మూగమనసులు ప్రభావం కనిపిస్తుంది. ఏఎన్ఆర్ మూగమనసులు సినిమా 1964లో రిలీజ్ అయింది. అంతస్తులు కారణంగా విడిపోయిన జంట పునర్జన్మలో వివాహం చేసుకొని కలవటమే ఈ సినిమా కధాంశం. ఆదుర్తి సుబ్బారావు ఈ సినిమాకు దర్శకుడు.

ముళ్ళపూడి వెంకటరమణ స్క్రిప్ట్ రాశారు. నాగేశ్వరరావుకు జోడిగా సావిత్రి, జమున నటించారు. ఎన్నో ఇబ్బందుల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల‌ ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు పొంది 175 రోజులు ఆడింది. తర్వాత ఆదుర్తి సుబ్బారావు నూతన్, సునీల్ దత్ ప్రధాన పాత్రల్లో హిందీలో మిలన్ గా తెరకెక్కిస్తే అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. అలా దాదాపు పునర్జన్మల నేపథ్యంలో వచ్చిన కథాంశంలో నటించి తండ్రి కొడుకులు ఇద్దరు సూపర్ హిట్ కొట్టడం చరిత్రలో అరుదైన సందర్భంగా నిలిచిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news