వామ్మో.. ఏంటిది అనసూయ స్టేజ్ పై ఏడ్చింది నిజం కాదా ..? దొంగ ఏడుపులా..? అంతా ఆఫర్ల కోసమే ఇలా చేస్తుందా? ఏంటో ఈ అనసూయ ఇలా మారిపోయింది ..? ఇలాంటి కామెంట్స్ తోనే సోషల్ మీడియాలో అనసూయ పేరుని మరోసారి ట్రోల్ చేస్తున్నారు కుర్రాళ్ళు . మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో అనసూయ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్కి గురవుతుంది. ఆమె ఏం చేసిన ట్రోల్ చేస్తున్నారు కుర్రాళ్ళు. మంచి పని చేసినా తిడుతున్నారు.. చెడ్డ పని చేసినా తిడుతున్నారు.
బుద్దిగా ఫ్యామిలీతో కూర్చుని పూజ చేసిన టార్గెట్ చేసి మీమ్స్ క్రియేట్ చేసి ఆమె పరువు తీస్తున్నారు . పిల్లలతో ఎంజాయ్ చేసిన చిట్టి పొట్టి బట్టలు అంటూ ఆమె పరువు తీస్తున్నారు . ఇలా అనసూయను కొందరు కావాలని టార్గెట్ చేశారు అన్న విషయం క్లియర్ గా అర్థమైపోయింది. రీసెంట్ గా రంగమార్తండ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ నటించిన అనసూయ తన ఎమోషన్ ని స్టేజిపై షేర్ చేసుకుంటూ ..”ఇలాంటి సినిమాలో నేను భాగమైనందుకు చాలా హ్యాపీ .. నేను రంగమార్తాండ సినిమాలో ఉన్నాను అది చాలు “అంటూ చాలా ఎమోషనల్ అయిపోయింది.
ఈ క్రమంలోనే ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇదంతా దొంగ ఏడుపు అని .. కావాలనే సినిమా ఆఫర్ల కోసం అనసూయ ఇలా ఏడుస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు . అయితే అనసూయ ఫ్యాన్స్ మాత్రం అలాంటి వాళ్లపై మండిపడుతున్నారు. అనసూయ కళ్ళల్లో మీకు దొంగ ఏడుపు కనిపించిందా..? ఒక్కసారి రివైండ్ చేసుకుని చూడండి.. ఆమె ఎంత ఎమోషనల్ గా ఈ సినిమాకి కనెక్ట్ అయి ఉంటే.. అంత బాధపడుతుంది. అయినా మనసు లేని వ్యక్తులు ఇలానే ట్రోల్ చేస్తూ ఉంటారు ..అనసూయ సూపర్ యాక్టింగ్ ..మల్టీ టాలెంటెడ్ అంటూ పొగిడేస్తున్నారు . దీంతో మరోసారి అనసూయ పేరు మారుమ్రోగిపోతుంది..!!