టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు – ఆసియన్ వాళ్ల భాగస్వామ్యంలో నిర్మించిన ఎఎంబి మల్టీ ఫ్లెక్స్ ఇప్పుడు హైదరాబాద్‌కే పెద్ద తలమానికంలా మారింది. గత 15 ఏళ్లలో హైదరాబాద్‌లో ఎన్నో మల్టీఫ్లెక్స్‌లు, మాల్స్ పుట్టుకు వచ్చాయి. గత ఐదారేళ్లలో కూడా యేడాదికి రెండు, మూడు చొప్పున పుట్టగొడుగుల్లా మాల్స్ వచ్చేస్తున్నాయి. ఇక స్క్రీన్ల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతూ పోతోంది.
ఇప్పుడు హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కూకట్పల్లి ఏరియాల్లో మినహా ఎక్కడా సింగిల్ స్క్రీన్లే కనిపించే పరిస్థితి లేదు. ఎన్ని మల్టీఫ్లెక్స్‌లు, మాల్స్ కూడా పుట్టుకు వస్తున్నా ఏఎంబీ మాల్ క్రేజ్ వేరేగా ఉంటోంది. అలాంటిది ఇప్పుడు ఈ ఏఎంబీ మాల్నే తలదన్నేలా మరో మాల్ వచ్చేస్తోంది. గతంలో అమీర్‌పేటలోని సత్యం థియేటర్ ఉండేది.
ఇప్పుడు ఆ థియేటర్ ఉన్న ప్లేస్‌లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీసుకున్న సంగతి తెలిసిందే. అక్కడే ఆసియన్ వాళ్లతో కలిసి మల్టీఫ్లెక్స్ కట్టేస్తున్నారు. దీని నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. మరో రెండు మూడు నెలల్లో ఓపెనింగ్‌కు రెడీ కానుంది. ఈ థియేటర్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయంటున్నారు. ఏఎంబీలో ఎమ్ లాంజ్ అని పెట్టినట్టుగా.. ఇక్కడ ఏఏ లాంజ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది లావిష్ సిట్టింగ్ ఏరియాలా కాకుండా… ఎంటర్టైనింగ్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక్కడ బన్నీ సినిమాల మర్చండైజర్, ఇతర వస్తువులు సేల్కు లభించేలా ప్లాన్ చేస్తున్నారు. భారీ ఖర్చుతో అల్లు అర్జున్ వర్చ్యువల్ ఇమేజ్ ప్లాన్ చేస్తున్నారు. దీని ముందు నుంచొని ఎవరు ఎలా చేస్తే ఆ ఇమేజ్ కూడా అలాగే రియాక్ట్ అవుతుందట. వినడానికే ఇది చాలా కొత్తగా ఉంది.. రేపు ఓపెన్ అయితే ఇది పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు మంచి అనుభూతి ఇస్తుందనడంలో సందేహం లేదు.
ఇక రెగ్యులర్ స్క్రీన్లతో పాటు శ్యామ్‌సంగ్ వాళ్ల నుంచి ఓ భారీ టీవీ స్క్రీన్ కూడా తెప్పించే ప్రయత్నం జరుగుతోంది. దీని వల్ల ప్రొజెక్టర్ లేకుండానే సినిమా వేసుకోవడంతో పాటు చాలా క్లారిటీ ఉంటుందట. ఏదేమైనా ఏఎంబీ మాల్‌ను తలదన్నేలా ఏఏ మాల్ ఉంటుందని అంటున్నా… ఇక్కడ ఏరియా తక్కువ… మరీ ఇది ఏ రేంజ్ అనుభూతిని నగర వాసులకు ఇస్తుందో ? చూడాలి.