టాలీవుడ్ నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ లాస్ట్ గా నటించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్..దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది . ప్రజెంట్ మరి కొద్ది రోజుల్లోనే ఆస్కార్ అవార్డు అందుకునే అంత స్థాయికి ఎదిగిపోయింది ఆర్ ఆర్ ఆర్. కాగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ పేరు మారుమ్రోగిపోతూ – ఉండడంతో ఆ సినిమాలో నటించిన ఎన్టీఆర్ చరణ్ పేర్లు కూడా అదే రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తర్వాత చేయబోతున్న కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కే సినిమా గురించి కూడా జనాలు చర్చించుకుంటున్నారు .
అయితే అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ ఇప్పటివరకు రాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ థర్టీ సినిమాకు సంబంధించిన మరో షాకింగ్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది , మనకు తెలిసింది ఎన్టీఆర్ థర్టీ సినిమాలో హీరోయిన్గా స్టార్ డాటర్ జాన్వీ కపూర్ ని సెలెక్ట్ చేశారు . అయితే మొదటి నుంచి ఈ సినిమాలో హీరోయిన్గా అనుకుంది ఆలియా భట్ ని అని సినీ వర్గాలలో టాక్ వినిపించింది . అంతేకాదు ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా అలియా భట్ కూడా స్వయంగా ఇదే విషయాన్ని అనౌన్స్ చేసింది. ఎన్టీఆర్ పక్కన మీరు నటించబోతున్నారా అంటే ఎస్ అంటూ కూడా ఆమె అభిమానులకు హింట్ ఇచ్చింది. ఈ క్రమంలోని ఆ తర్వాత ప్రెగ్నెంట్ కావడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి .
ఇదే క్రమంలో సినిమాలో ఎంతోమంది హీరోయిన్స్ ను ఎన్టీఆర్ పక్కన ఊహించుకున్న కొరటాల ఫైనల్లీ జాన్వికపూర్ ని సెలెక్ట్ చేశారట. అఫీషియల్ ప్రకటన కూడా ఇచ్చేశారు. అయితే ఇప్పుడు అలియా భట్ సైతం ఈ ప్రాజెక్టులో భాగమవ్వాలని ట్రై చేస్తుందట . ఈ క్రమంలోనే మొదటి నుంచి ఆలియాతో మంచి ఫ్రెండ్షిప్ ఉన్న తారక్ అలియాని ఫస్ట్ హీరోయిన్గా తీసుకొని జాన్వి ని సెకండ్ హీరోయిన్ గా పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారట . అయితే కొరటాల శివ మాత్రం జాన్వికపూర్ కే బెస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా బోనీకపూర్ తో మాట్లాడుకొని ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారని ..ఇప్పుడు తారక్ చెప్పిన విధంగా ఫస్ట్ హీరోయిన్గా మార్చలేమంటూ చెప్పేస్తున్నారట .
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సైతం హార్ట్ అవుతున్నట్లు తెలుస్తుంది . ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న అలియాభట్ అయితే ఫస్ట్ హీరోయిన్గా మంచి గా సినిమాకి న్యాయం చేస్తుందని ..ఇప్పుడిప్పుడే హీరోయిన్ ఎదుగుతున్న జాన్వీ కపూర్ సెకండ్ హీరోయిన్ కి కరెక్ట్ అని ఎన్టీఆర్ భావిస్తున్నారట . ఇదే విషయాన్ని కొరటాలకు చెప్పిన కొరటాల ఆయన సజెషన్ ని ఫాలో అవ్వకుండా జాన్వికపూర్ కే బెస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగానే కథను మలుచుకున్నాడు . ఈ క్రమంలోనే తారక్ మరోసారి కొరటాల డెసిషన్ కి హార్ట్ అయినట్లు తెలుస్తుంది. అంతేకాదు త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అనుకున్న ఫ్యాన్స్ కి మరో చిక్కుకొచ్చి పడింది. చూడాలి మరి కొరటాల ఏం చేస్తారో..?