ఈ మధ్యకాలంలో ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ గా పాపులారిటీ సంపాదించుకున్న.. కిర్రాక్ ఆర్పి పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆయన జబర్దస్త్ నుండి వీడిన తరువాత జబర్ధస్థ్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. జబర్దస్త్ లో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు .కాగా కొన్ని అనివార్య కారణాల కారణంగా జబర్దస్త్ ను విడిన ఆర్పి ప్రెసెంట్ బిజినెస్ లో అడుగుపెట్టారు . నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే కర్రీస్ పాయింట్.. స్టార్ట్ చేసి మంచి లాభాలు అందుకుంటున్నారు.
ఈ విషయాన్ని స్వయానా కిరాక్ ఆర్పి చెప్పుకోచ్చారు. కాగా రీసెంట్ గా అమీర్ పేట్ లో ని థండర్ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా ఆర్పి మాట్లాడుతూ ..తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది మేలో ఆర్పి కి లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయితో నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే . అప్పట్లో వీళ్ల నిశ్చితార్థంకి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు నాగబాబు కూతురు నిహారిక.. నాగబాబు.
కాగా ఇదే క్రమంలో వీళ్ళ పెళ్లి ఎప్పుడు అంటూ జనాలు విపరీతంగా ట్రోల్ చేశారు . ఇలాంటి క్రమంలోని పెళ్లి పైకి ఆర్పి సంచలన కామెంట్స్ చేశారు . “నాకు అబద్దాలు చెప్పడం రాదు.. ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తా ..అదే నాకు ప్లస్ అదే నాలో మైనస్ ..ఆమె వెంట నేను రెండేళ్లు పిచ్చి కుక్కలా తిరిగాను ..వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నాకే ఆ అమ్మాయి ఒప్పుకుంది . మా పెళ్లి నవంబర్ 29న జరగబోతుంది .మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి “అంటూ చెప్పకు వచ్చారు .
ఈ క్రమంలోనే లక్ష్మీ ప్రసన్న కూడా మాట్లాడుతూ. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ని బయటపెట్టింది. ” ఆర్సి రెడ్డి కోచింగ్ సెంటర్ లో నేను ఉన్నప్పుడు ఆయన గెస్ట్ గా వచ్చారు. అక్కడే పరిచయం ఏర్పడింది .ఆ తర్వాత మెల్లగా ఫోన్ నెంబర్ తీసుకొని దగ్గరయ్యారు. ఆ తర్వాత మా పేరంట్స్ తో మాట్లాడి పెళ్లికి ఒప్పించాడు “అని చెప్పుకొచ్చింది . ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.త్వరలోనే ఆర్పి ఓ ఇంటివాడు కాబోతున్నాడు అంటూ ఆనందం వ్యక్తం చేశారు ఆర్పి ఫ్రెండ్స్..!!