టాలీవుడ్ లో ఒకప్పటి క్రేజీ హీరో తరుణ్, దివంగత వర్ధమాన హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ప్రేమాయణం ఎంత హాట్ టాపిక్కో చెప్పక్కర్లేదు. అయితే వీరిద్దరూ ప్రేమించుకున్నప్పుడు అంత సోషల్ మీడియా యుగం కాదు.. అప్పుడు ప్రింట్ మీడియా, కొన్ని సినిమా మ్యాగజైన్లో మాత్రమే గాసిప్పులని ఎక్కువగా రాస్తూ ఉండేవి. ఆ టైంలో కూడా తరుణ్, ఆర్తి అగర్వాల్ ప్రేమలో ఉన్నారంటూ ఒక్కటే గుసగుసలు వినిపించేవి. పైగా నువ్వు లేక నేను లేను సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఎక్కడ చూసినా తరుణ్- ఆర్తి చెట్టపట్టలేసుకుని తిరగటం ఎక్కువైపోయింది.
కొందరు సినిమా జర్నలిస్టులకు కూడా వీరు కలిసి ఎన్నోసార్లు ఫోటోలకు దొరికిపోయారు. దాదాపు మూడేళ్ల పాటు వీరు తిరగని ప్లేస్ లేదు.. వీళ్లు వెళ్ళని హోటల్ లేదు అన్నట్టుగా వీరి ప్రేమాయణం సాగింది.
వీరి జంటకు జనాల్లోనూ క్రేజ్ ఉందని భావించిన సురేష్ బాబు తన బ్యానర్ లో సోగ్గాడు సినిమాలో మరోసారి వీరిద్దరిని రిపీట్ చేశాడు. అయితే ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు.
ఇక ఆర్తి తరుణ్ ని పిచ్చిపిచ్చిగా ప్రేమించేసింది. తరుణ్ కూడా ఆర్తిని అంతే ప్రేమించాడు. పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమైపోయాడు.
అయితే ఈ పెళ్లికి తరుణ్ తల్లి రోజా రమణి అభ్యంతరం వ్యక్తం చేసింది. తనకు కోడలుగా సాంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి రావాలి తప్ప.. ఒక హీరోయిన్ రావటం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే తరుణ్ ముందు ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ఆర్తిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అలా పెళ్లి చేసుకుంటే తల్లిని వదులుకోవాల్సి ఉంటుందని రోజారమని తేల్చి చెప్పడంతో తరుణ్ తల్లిని వదులుకొని ఆర్తిని పెళ్లి చేసుకునే ధైర్యం చేయలేకపోయాడు. నిన్ను భార్యగా స్వీకరించడం నా తల్లికి ఇష్టం లేదని ఆర్తికి ఓపెన్ గానే చెప్పేసాడు.
దీంతో ఆర్తి తట్టుకోలేకపోయింది. ఆమె హృదయం బద్దలైంది. ఆర్తి చనిపోయి కూడా దాదాపు 7, 8 ఏళ్లు అవుతోంది. తరుణ్ 40 ఏళ్ళ వయసు దాటిన ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. పెళ్లి వయసు కూడా దాటిపోయింది.. అందుకే తరుణ్ ఇప్పటికీ తన సన్నిహితుల దగ్గర తాను ఆర్తిని తన జీవితంలో ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటానని బాధపడుతూ ఉంటాడట. తరుణ్ ఈ వయసులో పెళ్లి చేసుకున్నా ఆర్తి లాంటి మంచి పెయిర్ అయితే అతడికి జీవితంలో ఎప్పటికీ రాదని కూడా సినిమా వాళ్ళు చెబుతూ ఉంటారు.