Moviesఆ హీరోయిన్‌ను దారుణంగా వాడేసిన టాప్ ఫ్యామిలీ హీరో... అందుకే టాలీవుడ్‌కు...

ఆ హీరోయిన్‌ను దారుణంగా వాడేసిన టాప్ ఫ్యామిలీ హీరో… అందుకే టాలీవుడ్‌కు దూర‌మైందా…!

సినిమా ఇండస్ట్రీలో వరుసగా విజయాలు దక్కితే ఇండస్ట్రీలో ఆ హీరోయిన్ కు తిరుగుండదు. అయితే ఒక హీరోయిన్ మాత్రం వరుసగా విజయాలు దక్కినా క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది. ప్రముఖ కుటుంబానికి చెందిన హీరో ఆమెను దారుణంగా వాడేశారని తెలుస్తోంది. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ తెలుగు, తమిళ భాషల్లో నటించిన సినిమాల ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యారు.

ప్రముఖ కుటుంబానికి చెందిన హీరో ఒకరు సినిమా షూట్ మొదలైన తర్వాత ఈ హీరోయిన్ ను వేధించడం మొదలుపెట్టారు. తను చెప్పిన విధంగా హీరోయిన్ నడుచుకోని పక్షంలో ఆమెను ఈ హీరో ఇబ్బందులకు గురి చేశారు. పెద్దగా బ్యాగ్రౌండ్ లేకపోవడం, ఆ హీరో కుటుంబంతో పెట్టుకుంటే ఇండస్ట్రీలో ఇబ్బందులు తప్పవని అర్థం కావడంతో ఆ హీరోయిన్ సైతం హీరో అడిగిన ప్రతి పనికి ఇష్టం లేకుండానే ఓకే చెప్పింది.

అయితే బాక్సాఫీస్ వద్ద నాలుగక్షరాలతో తెరకెక్కిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. మరోవైపు ఆ హీరో కెరీర్ కూడా ఆశాజనకంగా లేదు. ఆ హీరో ప్రస్తుతం హైదరాబాద్ కు కూడా దూరంగా ఉన్నారని తెలుస్తోంది. హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం వల్లే ఆ హీరో కెరీర్ నాశనమైందని హీరోయిన్ల ఉసురు ఆ హీరోకు తగిలిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ హీరో ఏ సినిమాలో నటించినా హీరోయిన్ తో ఎఫైర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మంచి కుటుంబంలో పుట్టిన హీరోకు ఇలాంటి పాడుబుద్ధి ఏంటో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ హీరో ఇకనైనా బుద్ధి మార్చుకోకపోతే మాత్రం ఏదో ఒకరోజు కుటుంబం పరువు గంగపాలు అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హీరోతో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు సైతం సిద్ధంగా లేరు. ఈ హీరోకు జోడీగా ఛాన్స్ వస్తే హీరోయిన్లు సైతం జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news