సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ కు ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కోట్లాదిమంది మనసులను కొల్లగొట్టిన ఏఆర్ రెహమాన్ అంటే జనాలు పడి చచ్చిపోతూ ఉంటారు . ఎలాంటి మూమెంట్లో అయినా సరే ఆయన కంపోజ్ చేసిన పాటలు వింటే మనసుకు చాలా హాయిగా ఉంటుందని .. చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పుకొస్తూ ఉంటారు . కాక ఇప్పటివరకు ఎప్పుడూ మీడియా ముందు బర్స్ట్ అవ్వని ఏఆర్ రెహమాన్ ఫస్ట్ టైం ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ జ్యూరీపై సంచల కామెంట్స్ చేసారు.
అర్హత లేని సినిమాలను కూడా ఆస్కార్ కి పంపిస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు . ” కొన్ని మంచి సినిమాలు ఆస్కార్కు వెళ్తాయని అనుకున్నానని.. కానీ అవి ఆస్కార్ కి కనీసం నామినేట్ కూడా అవ్వలేకపోయాయి అని.. కానీ జనాలు ఆ పాటలను ఆ సినిమాలను ఎంతో ఇష్టంగా ఇష్టపడతారని.. ఎందుకో ఆస్కార్ అకాడమీ అలాంటి సినిమాలను సెలెక్ట్ చేయదు అంటూ మండిపడ్డారు “.
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..” ఆర్ ఆర్ ఆర్.. ది ఎలిఫెంట్ విస్పర్స్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కి ఆస్కార్లు వరించాయి. ఇండియన్ సినిమాలకు ఆస్కార్ అవార్డు రావడం అనేది ఇది తొలిసారి . హ్యాపీగా ఉన్నాను . అయితే గతంలో ఎన్నోసార్లు పరమ చెత్త సినిమాలకు కూడా ఆస్కార్ వచ్చాయి. పరమ చెత్త సినిమాలకు కూడా ఆస్కారిచ్చారు. అసలు అలాంటి సినిమాలు ఆస్కార్ కి నామినేట్ కూడా అవ్వవు..అపూడు నేను బాధపడ్డాను. ఎందుకో తెలియదు కొన్ని కొన్ని సార్లు ఇలా సినిమా ఇండస్ట్రీలో మంచి టాలెంట్ ని తొక్కేస్తూ ఉంటారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు “. అంతేకాదు పరోక్షకంగా రెహమాన్ మంచి సినిమాలను ఆస్కార్ కి సెలెక్ట్ చేయడం లేదు అని వాటిని గుర్తించడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఏఆర్ రెహమాన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి..!!