సెన్సా ర్ వాళ్ళు సినిమాలలో అసభ్యత, అశ్లీలం,అరాచకం, హింస మితిమీరినపుడు తమ కత్తెరకు పని చెప్తు ఉంటారు. ఇప్పట్లో సెన్సార్ నిబంధనలు కాస్త సులువుగా ఉంటున్నాయి. ఆ రోజుల్లో అయితే సెన్సార్ వారి నిబంధనలు చాలా చాలా కఠినంగా ఉండేవి. అప్పటి స్టార్ హీరోలు తమ చిత్రాలలో సెన్సార్ వాళ్ళు వాళ్ళ కత్తెరకు పని చెప్పని అంశాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ఎక్కడో ఒక చోట సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పటం… దానిని కన్విన్స్ చేయడానికి సినిమా యూనిట్ ప్రయత్నించడం జరిగేది.
1960 వ దశకం నుంచి సెన్సార్ వారు తమ నిబంధనలను చాలా కఠినంగా అమలు చేయడం ప్రారంభించారు. దాగుడుమూతలు సినిమాలోని ‘ అడగక ఇచ్చిన మనసే ముద్దు పాటలో నువ్వు నేను ముద్దుకి ముద్దు ‘ అనే మాటలో డబుల్ మీనింగ్ ఉంది అని కత్తెరకు పదును పెట్టారు. ఆ పదాలను తొలగించే వరకు వదల్లేదు. 1965 లో అలనాటి మేటి స్టార్ హీరోయిన్ జయలలిత నటించిన తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు లో హీరోయిన్ స్విమ్ షూట్లో కనిపించం కూడా అశ్లీలంగా ఉందని సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పారు.
ఈ సీన్ కట్ చేస్తామని చెప్పినా దర్శక, నిర్మాతలు అందుకు అంగీకరించలేదు. దీంతో సెన్సార్ వాళ్ళు ఆ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అలా తొలి ఏ సర్టిఫికెట్ సినిమాగా మనుషులు మమతలు నిలిచింది.
ఆ రోజులతో పోలిస్తే ఈ రోజుల్లో సెన్సార్ నిబంధనలు చాలా సింపుల్ గా ఉన్నాయి. పైగా ఇప్పుడు ఏ సర్టిఫికెట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు. పైగా అదో గొప్పగా ఫీల్ అయే వారు కూడా ఉన్నారు. అయితే ఆ రోజుల్లో ఏ సర్టిపఫికెట్ ఇచ్చారంటే ఆ సినిమాపై జనాల్లో చిన్న చూపు ఉండేది. అలాంటి ఆపద తమ సినిమాకి రాకూడదని దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్త పడేవారు.
చివరకు ఈ సెన్సార్ కత్తెరకు సీనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా బలి అవకతప్పలేదు. ఎన్టీఆర్ నట్టించిన అగ్గిరవ్వ సినిమా అయన కెరీయర్ లో తోలిసారిగా ఏ సర్టిఫికెట్ పొందిన సినిమాగా రికార్డులలో నిలిచి పోయింది. ఈ సినిమా తాజాగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది . ఈ సినిమాలో ఫైటింగ్ సీన్లోలో హీరో ను దుండగులు కత్తితో చీలుతారు. ఆ సీన్ లో హీంస మితిమీరిపోయిందని.. దానిని కట్ చేయాలని సెన్సార్ వాళ్ళు సూచించారు.
ఆ సీన్ తర్వాత వచ్చే కోర్ట్ సీన్లో హీరో తన శరీరంపై ఉన్న గాయాలను ప్రదర్శిస్తారు. ఆ సీన్ కట్ చేయటం వల్ల కంటిన్యూటి పోతుందని నిర్మాత ఎన్టీఆర్, దర్శకుడు కె.బాపయ్య అంగీకరించలేదు. దీంతో ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఎన్టీఆర్, శ్రీ దేవి నటించిన అగ్గిరవ్వ సినిమాకు ముందు ఫ్లాప్ టాక్ వచ్చింది. అయితే ఆ తర్వాత ఓపెనింగ్స్ అదిరిపోయాయి. రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై ఎన్టీఆర్ స్వయంగా ఈ సినిమా నిర్మించారు.
సెకండ్ రిలీజ్ లో విడుదల అయిన అన్ని కేంద్రాలలోను అనుహ్యంగా వసూళ్ళు చూసింది. అప్పట్లో అగ్గిరవ్వ సినిమాకు ఏ సర్టిఫికెట్ రావటం ఒక సంచలనంగా నిలిచిపోయిది. అసలు ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ రావటం, సినిమాకు వచ్చిన ప్లాప్ టాక్‌కు, వచ్చిన వసూళ్ళకు ఎక్కడ పొంతన లేదని అప్పటి సిని వర్గాలు ఆశ్చర్య పోయాయి.