నందమూరి హీరో తారకరత్న మనందరిని దుంఖః సాగరంలో ముంచేస్తూ వెళ్లిపోయాడు. కేవలం 40 ఏళ్ల వయస్సులో తారకరత్న మనందరిని వదిలి వెళ్లడం బాధాకరం అయితే… ఎంతో మంచి మనస్సుతో పాటు ప్రతి ఒక్కరితో కలుపుగోలుగా ఉంటూ.. అప్యాయంగా పలకరించే వ్యక్తి కావడంతో ప్రతి ఒక్కరు తారకరత్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు మురళీ మోహన్ సైతం తారకరత్నతో తనకు ఉన్న అనుబంధం గుర్తు చేసుకుని తీవ్ర బావోద్వేగానికి గురయ్యారు.
తారకరత్న తనకు ఎప్పుడు ? ఎక్కడ కనిపించినా కూడా మావయ్యా అంటూ అప్యాయంగా పలకరించేవాడంటూ ఆ స్మృతులు నెమర వేసుకున్నారు. ఇక మురళీమోహన్‌కు, తారకరత్నకు ఏదో దూరపు బంధుత్వం ఉంది. ఆ మాటకు వస్తే నందమూరి ఫ్యామిలీతో మురళీ మోహన్ ఎంత క్లోజ్‌గా ఉంటారో తెలిసిందే. మురళీమోహన్‌తో ఉన్న బంధుత్వం వల్లే తారకరత్న ఆయన్ను మావయ్యా అని అప్యాయంగా పిలిచేవాడు.
తారకరత్న ఇద్దరు తాతలు కూడా ఎంతో పేరున్న వాళ్లే. ఇటు తాత ఎన్టీఆర్ మహానటుడు.. గొప్ప రాజకీయ నేత. అటు అమ్మ నాన్న ఉప్పలపాటి విశ్వేశ్వర్‌రావు కూడా గొప్ప నిర్మాత. విశ్వేశ్వర్‌రావు ఎన్టీఆర్‌తో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ఇందులో అన్నీ సినిమాలు సూపర్ హిట్. చాలా సినిమాలకు త్రిపురనేని మహారధి మాటలు రాశారు. ఈ పరిచయంతోనే ఎన్టీఆర్ బంధుత్వం కలుపుకుని ఆయన్ను వియ్యంకుడిని చేసుకున్నారు.