టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమాలతో పాటు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ..ప్రజెంట్ సినిమాలను రాజకీయాలను సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ.. తన కెరియర్ ని జెట్ స్పీడ్ లో కొనసాగిస్తున్నాడు. రీఎసంట్ గా అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్.. తన అభిమానులకు తెలియని ఎన్నో విషయాల గురించి ఓపెన్ అప్ అయ్యాడు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పరోక్షకంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఇష్యూ నడుస్తుందని రూమర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే . అలాంటి రూమర్లకి అన్ స్టాపబుల్ వేదికగా ఆజ్యం పోశాడు పవన్ కళ్యాణ్ . త్రివిక్రమ్ తో ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్న సంధర్భంలో ఫ్రెండ్షిప్ చేయాల్సి వచ్చింది అంటూ చెప్పుకు రావడం పవన్ ఫ్యాన్స్ కి అర్థం కాని పరిస్థితి నెలకోంది.
రీసెంట్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సార్ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయ్యాడు . ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గురించి ఏం ప్రస్తావించకపోవడం త్రివిక్రమ్ శ్రీనివాసరావు కు పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు ఉన్నట్లు కన్ ఫామ్ అయ్యింది. జనరల్ గా త్రివిక్రమ్ ..ఏ ఫంక్షన్ కి వెళ్ళినా పవన్ గురించి ఖచ్చితంగా రెండు ముక్కలైన మాట్లాడుతాడు . కానీ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించలేదు . ఈ క్రమంలోని త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు = పవన్ మధ్య వార్ జరుగుతున్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు .
అంతేకాదు కొందరు యాంటీ పవన్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ ని దూరం పెడితే పవన్ కళ్యాణ్ కే నష్టం ..ఆయనలాంటి డైరెక్టర్ మాటలు మాంత్రికుడు లేకపోతే పవన్ కెరియర్ ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు అని చెప్తుంటే.. పవన్ ఫ్యాన్స్ మాత్రం త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ విడిపోలేదని వాళ్ళు కలిసే ఉన్నారని.. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా ఇలాంటి వార్తల పై ఇద్దరు స్పందిస్తే కొంచెం ప్యాన్స్ ప్రశాంతంగా ఉండచ్చు..!!