MoviesAnasuya అన‌సూయ ప‌ద్ధ‌తిగా ఉన్నా వీళ్ల‌కు ఎంద‌కు న‌చ్చ‌ట్లేదు..!

Anasuya అన‌సూయ ప‌ద్ధ‌తిగా ఉన్నా వీళ్ల‌కు ఎంద‌కు న‌చ్చ‌ట్లేదు..!

గ్లామర్ బ్యూటీ హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ గ్లామర్ పిక్స్‌తో చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీతో కలిసి ఉన్నప్పుడు పిక్స్‌ను కూడా షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఇంకా చెప్పాలంటే భర్త, పిల్లలున్నప్పుడు కూడా అమ్మడు తొడలు కనిపించేలా చిన్న చిన్న నిక్కర్లేసుకొని అందాల విందు ఇస్తుంటుంది.

ఇలాంటి పిక్స్ చూసి సోషల్ మీడియాలో నెటిజన్స్ పెట్టే కామెంట్స్ కూడా చాలా వెరైటీగా ఉంటుంటాయి. వాటికి అనసూయ కూడా చాలా ఘాటుగా సమాధానం ఇస్తుంటుంది. అయినా అమ్మడు అందాల దాడి ఆపదు. జనాల కామెంట్స్ దాడి ఆపరు. ఇక్కడే కాకుండా విదేశాలకి వెళ్ళినప్పుడు అనసూయ అందాల ఆరబోతతో రెచ్చిపోయి చేసే ఫొటో షూట్స్ చాలామందికి హీటెక్కిస్తుంటుంది.

అలాంటి అనసూయ ఉన్నట్టుండి చాలా పద్ధతిగా మారి అచ్చతెలుగు ఆడపడుచులాగా చీరలో దర్శనమిచ్చింది. అంతేకాదు, చక్కటి నవ్వుతో రక రకాల ఫొటో షూట్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది. ఎప్పుడూ లేనిది ఇంత పద్ధతిగా అనసూయ కనిపించడం చూసి చాలామంది ఎంతో ఆనందంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలా మిమ్మలిని చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నామని రాస్తున్నారు.

కానీ, ఎప్పటిలాగే కొందరు యాంటీ ఫ్యాన్స్ మాత్రం అనసూయ మరీ ఇంత పద్ధతిగా ఉంటే మాకు చూడాలనిపించడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఇలాంటి వారి కామెంట్స్ చూస్తేనే కదా ఎవరికైనా మండకూడని చోట మండిపోయేది. ఏదో పద్ధతిగా చీరకట్టుకుంది. అది సినిమా కోసమో..లేక సరదాగానో. దీనికి కూడా కామెంట్స్ అంటే కాలిపోతుంది కదా..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news