సినిమారంగంలో హీరోల మధ్య ఇగోలు.. పంతాలు ఎలా ? కామన్ గా నడుస్తూ ఉంటాయో ? హీరోయిన్ల మధ్య కూడా అలాగే పంతాలు, మాట పట్టింపులు.. మాట్లాడుకోకుండా ఉండటం కామన్ గా నడుస్తూ ఉంటాయి. అయితే వృత్తిపరమైన పోటీ నేపథ్యంలో స్టార్ హీరోయిన్లుగా ఉన్నవారి మధ్య మాటలు ఉండవు. ఇప్పట్లో హీరోయిన్లు ఏడాదికి ఆరేడు సినిమాలు చేస్తేనే గొప్ప అన్నట్టుగా ఉంటుంది. ఒకప్పుడు హీరోయిన్లు యేడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేసేవారు.
పైగా ఒకే హీరో, హీరోయిన్ కలిసి ఏకంగా 30 – 40 సినిమాలు చేసిన జంటలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే అప్పట్లో స్టార్ హీరోయిన్లుగా ఉన్న ముగ్గురు హీరోయిన్ల మధ్య పంతాలు, పోటీ ఎక్కువుగా ఉండేది. వీరు ఎక్కడ కలుసుకున్నా.. చివరకు ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నా కూడా మాట్లాడుకోనంత పంతం ఉండేదట. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరో కాదు శ్రీదేవి – జయప్రద – విజయనిర్మల.
జయప్రదకు ఇటు శ్రీదేవి, అటు విజయనిర్మల ఇద్దరితోనూ మాట పట్టింపులు, పంతం నడిచింది. అయితే ఈ ఇద్దరి విషయంలోనూ అనేక కారణాలు జయప్రద మాట పట్టింపులకు కారణమయ్యాయి. ముందుగా శ్రీదేవి విషయానికి వస్తే శ్రీదేవి స్టార్ హీరోయిన్‌గా ఎదిగే టైంలోనే జయప్రద తిరుగులేని హీరోయిన్. ఇక ఎన్టీఆర్‌తో చేసిన వేటగాడు సినిమాతో శ్రీదేవికి కమర్షియల్ హీరోయిన్ స్టేటస్ దక్కింది.
అలాగే కృష్ణ సినిమాలు జయప్రదకు వెళ్లిపోయాయి. వీరిద్దరి కాంబోలో ఏకంగా 42 సినిమాలు వచ్చాయి.
ఎన్టీఆర్ – శ్రీదేవి కాంబినేషన్ అన్నది సూపర్ హిట్ అయ్యింది. శ్రీదేవి లైమ్‌లైట్‌లోకి వచ్చే టైంకే ఎన్టీఆర్ సూపర్‌స్టార్‌డమ్‌లో ఉన్నారు. అందుకే ఆయనతో వరుసగా సినిమాలు చేసి తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. వీరిద్దరి కాంబోలో వేటగాడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, సత్యం శివం, ఆటగాడు, అనురాగ దేవత సినిమాలు వచ్చాయి.
అలా వృత్తిపరంగా వారిద్దరి మధ్య వార్ బాగా నడిచింది. ఇక విజయనిర్మల, జయప్రద మధ్య మరో వార్ నడిచింది. కృష్ణతో విజయనిర్మల 40 సినిమాలు చేస్తే.. జయప్రద కూడా 42 సినిమాల వరకు చేసింది. అలా జయప్రద కృష్ణతో సన్నిహితంగా ఉండడం, పైగా అవుట్ డోర్ షూటింగులలో కృష్ణతో రాసుకుపూసుకు తిరగడం విజయనిర్మలకు నచ్చేదే కాదని అనేవారు. అలా జయప్రదకు శ్రీదేవి, విజయనిర్మలతో కొన్ని రోజుల పాటు మాట్లాడుకోనంత శత్రుత్వం అయితే ఉండేది.