టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో నువ్వు నాకు నచ్చావ్ ఒకటి. 2001 సెప్టెంబర్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా స్లో పాయిజన్‌లా ఎక్కి నాడు ఆంధ్రా యూత్‌ను, కాలేజ్ పోరగాళ్లు, అమ్మాయిలను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమా విజయంలో ఎన్ని పాయింట్లు ఉన్నా కూడా ఈ సినిమాతోనే హీరోయిన్‌గా పరిచయం అయిన ఆర్తీ అగర్వాల్ సినిమాకు మేజర్ ఎస్సెట్. అందులో ఎలాంటి డౌట్ లేదు.
ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించారు. ఈ సినిమా విజయంలో త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే కీ రోల్ ప్లే చేసింది. ఇక కామెడీ పంచ్‌లు అదుర్స్. వెంకటేష్‌తో కూడా అదిరిపోయే కామెడీ చేయించొచ్చని ఈ సినిమా ఫ్రూవ్ చేసింది. ఇప్పుడు బుల్లితెరపై ప్రసారమైనా కూడా ఈ సినిమాకు అదిరిపోయే రేటింగ్ వస్తూ ఉంటుంది.
ఇక బ్రహ్మీ, సునీల్ కామెడీ అయితే పొట్టచెక్కలయ్యేలా డిజైన్ చేశారు. అన్నింటికి మించి ఆర్తీ అగర్వాల్ గ్లామర్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఈ సినిమాకు ముందుగా అనుకున్న హీరో వేరే. అయితే మధ్యలో అనూహ్యంగా వెంకటేష్ వద్దకు చేరింది. త్రివిక్రమ్ కథ రాసుకుంది తరుణ్ కోసం. తరుణ్ అప్పటికే నువ్వే కావాలి, ప్రియమైన నీకు సినిమాలో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు.
అందుకే త్రివిక్రమ్ కూడా కథ రాసుకుని తరుణ్ డేట్ల కోసం వెయిట్ చేస్తున్నాడు. ఓ సందర్భంలో రామానాయుడు స్టూడియోలో ఈ కథను సురేష్‌బాబుకు చెప్పాడట. వెంటనే వెంకటేష్‌తో చేద్దామని అనడంతో త్రివిక్రమ్ కాదనలేకపోయాడట. అలా కె. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కి 57 కేంద్రాల్లో 100 రోజులు ఆడి బ్లాక్‌బస్టర్ అయ్యింది. అలా ఈ బ్లాక్‌బస్టర్ తరుణ్ చేజారింది.