టాలీవుడ్ లో దివంగత సీనియర్ హీరో ఏఎన్నార్ – దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు మధ్య ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. ఇంకా చెప్పాలంటే పాలకొల్లుకు చెందిన దాసరి సినిమాల్లోకి రావడానికి ప్రేరేపితమైన వ్యక్తి ఏఎన్నార్. తనకు హీరోల్లో అక్కినేని నాగేశ్వరరావు, హీరోయిన్లలో సావిత్రి అక్క అంటే ఎంతో ఇష్టమని… వీరిద్దరి స్ఫూర్తితోనే తాను సినిమాల్లోకి వచ్చానని దాసరి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అలాగే దాసరి – ఏఎన్ఆర్ కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
ఏఎన్నార్ తర్వాత ఆయన తనయుడు నాగార్జునతో కూడా మజ్ను లాంటి విషాదంతా ప్రేమకావ్యం తీసి సూపర్ హిట్ ఇచ్చారు దాసరి. అలాంటి దాసరి – ఏఎన్నార్ మధ్య చిన్న చిన్న విషయాలలో ఇద్దరు పంతాలకు పోవడంతో అవి పెద్దవి అయ్యి.. ఇద్దరి మధ్య తీవ్రమైన మనస్పర్ధలకు కారణం అయ్యాయి. చివరకు ఇద్దరు పగ, ప్రతీకారాలకు పోయి ఒకరిని ఒకరు మాట్లాడించుకోవడం కాదు.. ఒకరి మొఖం మరొకరు చూసేందుకు కూడా ఇష్టపడనంత స్థాయికి వచ్చేసాయి.
రెండు కారణాలు దాసరి – ఏఎన్ఆర్ మధ్య గ్యాప్ పెరగటానికి కారణమైనట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. ఇద్దరూ కలిసి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన తర్వాత ఒకానొక సందర్భంలో ఏఎన్ఆర్ తన వల్లే దాసరికి దర్శకుడుగా మంచి పేరు వచ్చిందని… తన సినిమాలతోనే ఆయన టాప్ డైరెక్టర్ అయ్యారని అన్నారట. దాసరి ముందు ఏఎన్నార్ అలా అనడంతో ఆయన నొచ్చుకున్నారు. ఏఎన్నార్‌కు అంత అహకారం పనికిరాదని కూడా సన్నిహితుల వద్ద వాపోయారు.
అలాగే అన్నపూర్ణ స్టూడియోను దాసరి డైరెక్ట్ చేసిన ఓ సినిమా షూటింగుకు వాడుకున్నారు. అప్పుడు స్టూడియో వ్యవహారాలను ఏఎన్నార్ కుమార్తె సత్యవతి కూతురు అయిన యార్లగడ్డ సుప్రియ ( పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి హీరోయిన్ ) చూసుకుంటున్నారు. షూటింగు కోసం స్టూడియో కు అద్దె విషయంలో ఏర్పడిన చిన్న వివాదం… చివరకు ఏఎన్ఆర్ వర్సెస్ దాసరి మధ్య వివాదంగా మారిపోయింది. అప్పటికే పాత గొడవ ఉండడంతో ఇద్దరు పెద్ద శత్రువులుగా మారిపోయారు. ఈ విషయంలో మాత్రం ఏఎన్నార్ తప్పులేదనే అంటారు.
చివరకు సీనియర్ నటి నిర్మలమ్మ మృతి చెందినప్పుడు ముందుగా ఏఎన్నార్ అక్కడికి చేరుకున్నారు. తర్వాత దాసరి అక్కడకు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఏఎన్ఆర్ ఆ ఇంటికి వెనుక వైపు ఉన్న గేటు నుంచి వెళ్ళిపోయారు. అలాగే ఏఎన్ఆర్ భార్య అన్నపూర్ణను చూసేందుకు దాసరి వాళ్ల ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ముందుగా నాగార్జునకి ఫోన్ చేసి తాను వస్తున్నట్లు చెప్పగా.. గురువుగారు దానికి ఫోన్ చేయడం ఎందుకు రండి అని నాగార్జున చెప్పారట.
ఆ వెంటనే నాగార్జున ఫోన్ చేసి ఇప్పుడు ఇక్కడ నాన్నగారు ఉన్నారు.. తర్వాత వద్దురుగాని అని చెప్పడంతో దాసరి తీవ్రంగా హర్ట్ అయ్యారట. మధ్యలో దాసరి ఏఎన్నార్ తో సర్దుబాటు చేసుకునేందుకు రెండు మూడు ప్రయత్నాలు చేసినా ఏఎన్ఆర్ అందుకు సుమఖత వ్యక్తం చేయలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతాయి. ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన ఈ ఇద్దరు కెరియర్ చివర దశలో ఒకరి ముఖం ఒకరు చూసుకునేందుకు కూడా ఇష్టపడనంత శత్రువులుగా మారిపోవటం బాధాకరం.