నందమూరి తారకరత్న కేవలం 40 ఏళ్ల వయస్సులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం ప్రతి ఒక్కరు జీర్ణించుకోలేకపోతున్నారు. తారకతర్న ఎన్టీఆర్ ఐదో కుమారుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయిన నందమూరి మోహన్‌కృష్ణ కుమారుడు. మోహన్‌కృష్ణకు కూడా సినిమా రంగంలో అనుభవం ఉంది. ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయడంతో పాటు కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. సినిమా రంగానికి దూరమయ్యాక ఆయన వ్యాపారాలకు పరిమితం అయ్యి ఇంట్లోనే ఉంటున్నారు.
ఆయన తనయుడిగా సినిమాల్లోకి వచ్చిన తారకరత్నకు ఆరంభంలోనే ఏకంగా 9 సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభోత్సవం జరుపుకోవడం అప్పట్లో ఓ సంచలనం. ఇక తారకరత్న అలేఖ్యరెడ్డిని 2012లో పెళ్లి చేసుకున్నాడు. ఆమె వైసీపీ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి భార్య చెల్లి కూతురు. అప్పటికే ఆమెకు మాజీ హోం మంత్రి అయిన ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడితో వివాహం జరిగి మనస్పర్థల నేపథ్యంలో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.
ఆమె ఫ్యాషన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్. ముందు వీరిద్దరూ స్నేహితుల ద్వారా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తారకరత్న నటించిన నందీశ్వరుడు సినిమాకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఆ టైంలో మంచి స్నేహితులు అవ్వడం, ఆ తర్వాత ప్రేమికులు అవ్వడం చకచకా జరిగాయి. ముందుగా తారకరత్నే అలేఖ్యను ఇష్టపడ్డాడు. ఎందుకంటే అప్పటికే ఆమెకు పెళ్లయ్యి విడాకులు జరిగాయి. పైగా వయస్సులోనూ ఆమె తారక్ కంటే పెద్దదనే అంటారు.
అయితే ఆమెను కోడలిగా స్వీకరించేందుకు నందమూరి కుటుంబ సభ్యులు ఇష్టపడలేదు. అప్పటికే పెళ్లైన వీడోను పెళ్లి చేసుకోవడం ఏంటని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే సన్నిహితుల సమక్షంలో ఓ ఆలయంలో వీరు వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి అలేఖ్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ఇష్టమే. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు తారకరత్న, తన కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నారు.
2013లో ఈ దంపతులకు నిష్కా అనే పాప పుట్టింది. పాప పుట్టాక బాలయ్య మధ్యవర్తిత్వం ద్వారా తారకరత్న – నందమూరి కుటుంబ సభ్యులు కలిసిపోయారు. ఇక త్వరలోనే తారకరత్న మిస్టర్ తారక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలోనే ఈ బాధాకర సంఘటన జరిగింది.