రమాప్రభ ఎంతో గొప్ప నటి. తెలుగు సినిమా రంగంలో ఆరేడు దశాబ్దాల పాటు తన హవాను కొనసాగించిన నటి. 1960 – 70వ దశకం నుంచి 30 ఏళ్ల పాటు ఎన్నో సినిమాల్లో నటించి ఓ వెలుగు వెలిగిన ఆమె ఆ తర్వాత సినిమాలకు దూరమైనా మధ్యలో తళుక్కున మెరిసిన సందర్భాలు ఉన్నాయి. ఒకప్పుడు కోట్లాది రూపాయల ఆస్తులు ఆమె సొంతం. ఆమె చేసిన చిన్న తప్పులతో అవన్నీ పోయాయి. చివరకు ఇంట్లో గడవడం కోసం ఆమె దగ్గర ఉన్న చిన్న చిన్న బంగారపు వస్తువులను కూడా అమ్ముకున్న రోజులు ఉన్నాయని ఆమె గురించి బాగా తెలిసిన వాళ్లు చెప్పేమాట.
ఇక రమాప్రభ – రాజబాబు కాంబినేషన్ అంటేనే అప్పట్లో పిచ్చ క్రేజ్. వీరిద్దరి కాంబినేషన్లో కామెడీ అన్నా.. వీరిద్దరు కలిపి చేసే అల్లరి అన్నా… వీరు చేసిన సినిమాల్లో వీరి మధ్య ప్రేమ సీన్లు అన్నా అబ్బబ్బా ఆ తరం ప్రేక్షకులకు ఓ తీపి గుర్తులు. నిజానికి వీరిద్దరు వెండితెర మీద ఎంతగా ప్రేమను ఒలకబోసుకునే వారో.. రియల్ లైఫ్‌లోనే ప్రేమికులుగా ఉన్నారని అప్పట్లో టాక్.
సరే వ్యక్తిగత విషయాలు ప్రస్తావించి అంత సీనియర్ నటులపై కామెంట్లు చేయడం మన తరానికి భావ్యం కాకపోయినా వీరిద్దరి మధ్య ప్రేమ నడిచిందనే అంటారు. అసలు వీరు కొన్ని రోజుల పాటు ఎవ్వరికి కనపడేవారు కాదని కూడా టాక్ ఉంది. ఒకానొక టైంలో ఏ సినిమాలో చూసినా రమాప్రభ, రాజబాబు కాంబినేషనే ఉండేది. అసలు శివాజీ గణేషన్‌కు కూడా అంత బిజీ ఉండేదే కాదట.
మద్రాస్‌లో ఒక స్టూడియోలో ఒకే కాటేజ్‌లోనే వీరు ఉండేవారని.. వీరి గురించి తెలిసిన నాటి తరం సినీ విశ్లేషకులు చెప్పేమాట. దీనిని బట్టే వీరిద్దరి బంధం ఏ రేంజ్‌లో ఉండేదో తెలుస్తోంది. ఆ తర్వాత రమాప్రభ కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారు. ఆమె తనకంటే వయస్సులో చిన్నవాడు అయిన శరత్‌బాబును ప్రమోట్ చేసే క్రమంలో అతడికి దగ్గరై పెళ్లి చేసుకుంది.
14 ఏళ్ల పాటు కలిసి కాపురం చేశాక శరత్‌బాబే ఆమెను అన్ని విధాలా వాడుకుని వదిలించుకున్నాడనే అంటారు. వయస్సులో రమాప్రభ శరత్‌బాబు కంటే పెద్దది. తాను ప్రమోట్ అయ్యేందుకు రమాప్రభను వాడుకుని.. ఆమె అండదండలతో ఆర్థికంగా ఎదిగిన శరత్‌బాబు చివరకు ఆమె సంపాదించిన ఆస్తులు కూడా తనవే అని చెప్పి వదిలించుకున్నాడని రమాప్రభ కోర్టులోనే వాపోయింది. అలా వారి బంధం ముగిసింది.