టాలీవుడ్ యంగ్‌టైగర్ JR NTR త్రిబుల్ ఆర్ సినిమాతో తన కెరీర్‌లోనే ఫస్ట్ టైం డబుల్ హ్యాట్రిక్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని కొరటాల శివ దర్శకత్వంలో తన కొత్త సినిమాను ఎనౌన్స్ చేశాడు. ఈ సినిమా తర్వాత కేజీయఫ్, సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుంది. వరుసగా ఎన్టీఆర్ రెండు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టేశాడు.
ఇక ఎన్టీఆర్ గత రాత్రి తన సోదరుడు నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన అమిగోస్ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్‌కు చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయ్యాడు. అయితే ఎన్టీఆర్‌కు తన ఫ్యాన్స్ నుంచి తన 30వ సినిమా ప్రాజెక్ట్‌పై అప్‌డేట్ ఇవ్వమని కోరగా ఎన్టీఆర్ కాస్త చికాకుగా ఉన్నాడు. అయితే వెంటనే యాంకర్ సుమ కూడా తానా తందానా అంటూ మీ కొత్త సినిమా అప్‌డేట్ ఇవ్వాలని డైరెక్టుగానే అడిగేసింది.
వెంటనే ఎన్టీఆర్ కాస్త సీరియస్ అయినట్టుగా ఉన్నాడు. వాళ్లు అడగకపోయినా.. వాళ్ల తరపున మీరే చెప్పించేసేలా ఉన్నాడుగా అంటూ కౌంటర్ వేశాడు. అనంతరం ఫ్యాన్స్‌కు కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. నాకు ఒంట్లో బాగోలేకపోయినా కూడా మీకోసమే తాను వచ్చానని.. బాడీ ఫెయిన్స్ వల్ల ఎక్కువ సేపు నిలబడలేకపోతున్నా… దయచేసి అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
ఇక తన కొత్త సినిమా అప్‌డేట్ అప్‌డేట్ అంటూ ఇబ్బంది పెట్టవద్దని.. ప్రతి రోజు.. ప్రతి గంటా అప్‌డేట్ ఇవ్వాలంటే కష్టం అని.. అభిమానుల ఉత్సాహం, ఆరాటంతో డైరెక్టర్లు.. నిర్మాతలపై బాగా ఒత్తిడి పెరిగిపోతుందని దయచేసి అభిమానులు ఈ విషయంలో అర్థం చేసుకోవాలని విజ్క్షప్తి చేశాడు.
అలాగే ఏదైనా అప్‌డేట్ ఉంటే… ఇంట్లో మా భార్య కంటే ముందే మీకు చెపుతాం అంటూ తారక్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్‌కు కాస్త లైట్‌గా హెల్త్ బాగోలేదని.. అందుకే కాస్త ఇబ్బంది పడుతూ కనిపించాడని తెలుస్తోంది.