చెన్నై చిన్నది సమంత గత కొంతకాలంగా మయోసైటీస్ వ్యాధితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధికి చికిత్స చేయించుకుంటోన్న సమంత సినిమాల ప్రమోషన్లకు కూడా దూరంగా ఉంటూ వస్తోంది. తాజాగా సమంత శాకుంతలం సినిమా ప్రమోషన్లలో కనిపించి అందరికి పెద్ద షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యింది. ఇది ఆమె అభిమానులను సైతం బాధపెట్టింది.
ఇక ఈ మయోసైటీస్ వ్యాధి నుంచి సమంత ఇప్పుడిప్పుడే రికవరీ అవుతూ ఉంది. తాజాగా ఆమె బాలీవుడ్ దర్శకద్వయం రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తోన్న సీటాడెల్ లో నటిస్తోంది. అవెంజర్స్ సీరిస్ సినిమాల దర్శకుడు రూస్సో బ్రదర్స్ రూపొందించిన వెబ్‌సీరిస్‌కు ఇండియన్ వెర్షన్‌గా ఈ సీటాడెల్ తెరకెక్కుతోంది. ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత తన బెస్ట్‌ఫ్రెండ్ చిన్మయిపై సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
సీటాడెల్లోకి సామ్ ఎంట్రీతో ఆమెకు ఆ సినిమా యూనిట్ నుంచి స్వాగతం లభించింది. దీనిపై చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ స్పందించాడు. సామ్ ప్రయాణం ఎలా ? స్టార్ట్ అయ్యిందో నాకు ఇంకా గుర్తుంది.. హాలీవుడ్ ప్రముఖ దర్శకులు రూస్సో బ్రదర్స్ ఆమెను ఆహ్వానిస్తుంటే తనకు చాలా గర్వంగా ఉందన్నాడు. దీనిపై చిన్మయి స్పందించింది. సమంత ఓ క్వీన్ అనేందుకు ఇదే నిదర్శనం అని చెప్పింది.
చిన్మయి కామెంట్‌పై సమంత మళ్లీ ట్వీట్ చేసింది. నేను కాదు నువ్వే చిన్మయి అంటూ ట్వీట్ చేయడంతో పాటు రాహుల్ లాంటి ఫ్రెండ్ లభించడం తన అదృష్టం అని పేర్కొంది. ఇక చాలా కాలం తర్వాత సామ్ చిన్మయి గురించి సోషల్ మీడియాలో కామెంట్ చేసింది. అంతకుముందు వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందన్న ప్రచారం గట్టిగా నడిచింది.
సామ్ తొలి సినిమా ఏమాయ చేశావే టైం నుంచి కూడా చిన్మయినే సామ్‌కు డబ్బింగ్ చెప్పింది. అయితే యూటర్న్ నుంచి సామ్ తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకోవడంతో గ్యాప్ పుకార్లు వచ్చాయి. అయితే తాజా సంభాషణలతో వాటికి చెక్ పడినట్లయ్యింది.