ఊర్వశిగా.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరకాల ముద్ర వేసుకున్న నటీమణి శారద. పదునైన డైలాగులు.. వాక్చాతుర్యం.. ఏ పాత్రనైనా అలవోకగా నటించే తత్వం వంటివి.. ఆమెను అనతి కాలంలో ఎదిగేలా చేశాయి. ఉన్నత విద్యావంతురాలైన శారద.. సినీ రంగంలోకి ఒక చిన్న సందర్భంలో ప్రవేశించారని అంటారు. తొలినాళ్లలోనే హీరోయిన్‌గా ప్రయత్నాలు చేశారు. మానవుడు-దానవుడు వంటి అజరామరమైన చిత్రాల్లోనూ నటించి.. అందరి మెప్పు పొందారు. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు శారద.
మహిళాదరణ ఎక్కువగా చూరగొన్న నటీమణుల్లో ఊర్వశి శారద పేరు ఎప్పటికీ ముందుంటుందంటే అతిశయోక్తికాదు. అయితే.. కెరీర్‌లో నిలదొక్కునేందుకు ముందు.. తర్వాత.. శారద విలక్షణంగా వ్యవహరించారనేది గుమ్మడి వెంకటేశ్వరరావు.. రాసిన పుస్తకంలో స్పష్టంగా తెలుస్తుంది. ఆ అమ్మాయ్యేంటో అలా మారిపోయింది.
అని గుమ్మడి పెదవి విరిచారు. తొలినాళ్లలో అందరితోనూ కలివిడిగా ఉన్న శారద.. తర్వాత తర్వాత.. ఒంటరిగా ఉండడం.. పెద్దగా ఎవరినీ నమ్మక పోవడం వంటివి ఇండస్ట్రీలో టాక్‌గా ఉండేవన్నారు.
ఇలాంటి లక్షణాలు మాకు కొందరిలోనే కనిపించేవి. కానీ, శారద వర్ధమాన నటిగా అడుగు పెట్టాక.. బాగానే ఉన్నప్పటికీ.. తర్వాత తర్వాత..మనుషులకు చేరువైనా.. నటులకు దూరమైంది. తనదో భిన్నమైన వ్యవహార శైలి!
అని గుమ్మడి రాసుకున్నారు. గతంలో ఒకరిద్దరు ఇలానే వ్యవహరించారని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ.. శారదకు అవకాశాలు తగ్గలేదన్నారు. ఆర్థికంగా బలంగా పుంజుకున్నారని..ఎక్కువగా శోభన్‌బాబు సలహాలు పాటించేవారని.. ఆయన అంటే ఇష్టంగా ఉండేవారని గుమ్మడి రాసుకొచ్చారు.
శారద అనే కాదు.. చాలా మంది అప్పట్లో నిర్మాతల ద్వారా కొంత లాస్ అయ్యారు. వారు ఇస్తామని ఒప్పుకొన్న మొత్తాలు ఇచ్చేవారు కాదు. ఒకవైపు అభిమానుల నుంచి ఒత్తిళ్లు. దీంతో కొంత మంది చాలా గడుసుగా మారారు. వీరిలో శారద మరీ గడుగ్గాయి పిల్ల
అని గుమ్మడి పేర్కొన్నారు. ఆమెతో కలిసి నటించి ఒకటి రెండు సినిమాలే అయినా.. ఆమె వ్యక్తిత్వం తనకుఎంతో నచ్చిందని గుమ్మడి రాసుకొచ్చారు.