టాలీవుడ్ గత కొన్నాళ్ల నుంచి తీవ్ర విషాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, పెద్దలు, సీనియర్ నటీమణులు వరుసగా మృతిచెందుతున్నారు. ఇక తాజాగా నందమూరి హీరో, ప్రముఖ రాజకీయ నేత తారకరత్న మృతిచెందడం అందరిని తీవ్రంగా కలిచి వేసింది. కేవలం 40 ఏళ్ల వయస్సులో ఇటు సినిమాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ ఎంతో భవిష్యత్తు ఉండి ఇలా మృతి చెందడం ఎంతో బాధాకరం.
23 రోజుల పాటు బెంగళూరు నారాయణ హృదయాలయాలో మృత్యువుతో పోరాడిన తారకరత్న తిరిగి వస్తాడని అందరూ ఆశలతో ఉంటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాదం నుంచి తేరుకోకముందే సినిమా పరిశ్రమలో ఈ రోజు మరో విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్‌లో ప్రముఖ కమెడియన్ అయిన సీనియర్ కమెడియన్ మయిల్ సామి మృతిచెందారు.
1984 నుంచి సినిమా కెరీర్ స్టార్ట్ చేసినా తాను ఇప్పటకీ నటుడిగానే కంటిన్యూ అవుతున్నారు. ఈ రోజు తాను ఆకస్మికంగా అస్వస్థతకు గురవ్వగా.. కుటుంబ సభ్యులు పోరూర్ రామచంద్ర హాస్పటల్లో జాయిన్ చేశారు. అయితే మార్గమధ్యలోనే తన 57వ యేట మృతిచెందారు. విచిత్రం ఏంటంటే ఈ ప్రమాదానికి ముందు కూడా ఆయన ఓ సినిమాకు డబ్బింగ్ చెప్పుకున్నారు.
మయిల్ స్వామికి కోలీవుడ్‌లో మంచి కమెడియన్‌గా పేరుంది. ఆయన మృతి పట్ల పలువురు కోలీవుడ్ నటులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.