గోవిందరాజుల సుబ్బారావు. విజయవాడకు చెందిన నాటక రంగ పితామహుడిగా పేరు తెచ్చుకున్నారు. ఒకప్పటి పాత బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో(ఎన్టీఆర్ కన్నా ముందు) అంటే.. 1950 ప్రాంతాల్లో గోవిందరాజుల సుబ్బారావు తెలుగు తెరను ఏలుతున్న రోజులు. అప్పట్లో చిత్తూరు వి. నాగయ్య హీరోగా దుమ్ముదులిపేస్తు న్నారు. అయితే.. ఇప్పటి మాదిరిగా అప్పట్లో సినిమాలపట్ల ఎంకరేజ్‌మెంట్ ఉండేదికాదు
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా.. ఔత్సాహిక కళాకారులకు, నటులకు కొదవలేదు. ఎక్కడో ఓమూల చిన్న ప్రకటన ఇచ్చినా చాటు.. నటులు క్యూకట్టేస్తున్నారు. అయితే.. 1950లలో మాత్రం నటులు పెద్దగా ఉండేవారు కాదు. దీనికి కారణం సినీ రంగంపై అనేక అపోహలు హల్చల్ చేయడమే. సినీరంగంలో ఉన్నవారికి వ్యసనాలు ఉంటాయని.. పెద్ద ఎత్తున ప్రచారం ఉండేది.
ఇక, లేడీస్ పాత్రలకు అయితే.. మరింత డిమాండ్. ఎందుకంటే..వీరి కొరత మరీ ఎక్కువగా ఉండేది. దీంతో హీరోయిన్ వేషాలు వేసేవారి కోసం.. గోవిందరాజుల సుబ్బారావు, చిత్తూరు వి.నాగయ్య లు ఊరంతా గాలించి తెచ్చుకునేవారు. పైగా.. ఇప్పట్లో మాదిరిగా అప్పట్లో ఎలాంటి నటనా కాలేజీలు(యాక్టింగ్ స్కూల్స్) లేవు. నాటకరంగంలో ఉన్నవారిని తీసుకునేవారు. ఇదే వారికి పెద్ద వేదిక. ఇదే పెద్ద సర్టిఫికెట్ కూడా.
ఇలా వెతికి పట్టుకున్న హీరోయిన్ సూర్యాకాంతం. ఆశ్చర్యంగా అనిపించినా.. 1940 ప్రాంతంలో వచ్చిన ఒకటి రెండు సినిమాల్లో సూర్యాకాంతం హీరోయిన్‌గా నటించారు. అప్పట్లో సినిమా మూడు గంటల నిడివి ఉండేది. హీరోయిన్లకు కొరత ఉండడంతో సూర్యాకాంతాన్ని గోవింద రాజుల సుబ్బారావు బాగా ప్రోత్సహిం చేవారు. దీంతో ఆయనను బాబాయి గారు.. అని ఎంతో గౌరవంగా చూసుకునేవారట సూర్యాకాంతం. సుబ్బారావు తుది రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. అన్నీతానై ఆదుకున్నారట కూడా.