ఈ మధ్యకాలంలో సెలబ్రెటీల పెళ్లిళ్లు ఎంత హంగామా చేసి చేసుకుంటున్నారో మనందరికీ తెలిసిందే . పెళ్లి కోసం కొన్ని కోట్లు ఖర్చు చేస్తూ .. రాజుల కాలం నాటి రోజులను గుర్తు చేస్తున్నారు బాలీవుడ్ బడా సెలబ్రిటీస్. అయితే టాలీవుడ్ ప్రముఖులు సైతం తమ పెళ్లిని గ్రాండ్గా చేసుకుంటున్నారు . కాగా రీసెంట్గా టాలీవుడ్ యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న సాయిధరమ్ తేజ్ .. తన పెళ్లి అయిపోయింది అంటూ చెప్పి బిగ్ బాంబ్ పేల్చారు .
దింతో ఒక్కసారిగా మెగా ఫాన్స్ షాక్ అయిపోయారు . మనకు తెలిసిందే సాయిధరమ్ తేజ్ మెగా హీరో ట్యాగ్ చేసుకొని ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . తర్వాత అయినా స్టైలో సినిమాలో నటిస్తూ కంటెంట్ ఉన్న పాత్రలు చేస్తున్న సాయి ధరమ్ తేజ్ .. రీసెంట్ గానే అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చి తనదైన స్టైల్ లో అలరించాడు. కాగా రీసెంట్గా వినరో భాగ్యము విష్ణు కథ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ ..తన పెళ్లి అయిపోయింది అంటూ షాక్ ఇచ్చాడు.
ట్రైలర్ లాంచ్ తర్వాత మీడియాతో మాట్లాడుతున్న సాయి ధరమ్ తేజ్ ని మధ్యలో అభిమానులు “అన్నా నీ పెళ్లెప్పుడు” అంటూ గోల గోల చేశారు . ఈ క్రమంలోని సాయి ధరంతేజ్ “ముందు మీరు అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి రా.. ఆ తర్వాతే నా పెళ్లి” అంటూ క్లారిటీ ఇచ్చాడు. అయినా వాళ్ళు వినకుండా..”మీరు ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారు..అంటూ గోల చేస్తూ ఉండడంతో ..అరే బాబు నా పెళ్ళి ఎప్పుడో అయిపోయింది.. నాలుగు సార్లు అయింది ” అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు .
అయితే సరదాగా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . నిజంగానే సాయిధరమ్ తేజ్ పెళ్లి చేసేసుకున్నాడా..? అందుకే ఇలాంటి కామెంట్స్ చేశాడా..? లేకపోతే మెగా హీరో స్థాయి ఉన్న సాయి ధరమ్ తేజ్ ఇలా చిల్లర కామెంట్స్ చేయడం ఏంటి ..? అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ఆయనను ట్రోల్ చేస్తున్నారు. చూడాలి దీనిపై ఎలాంటి క్లారిటీ ఇస్తాడో సాయిధరమ్ తేజ్ మరి..!!