సినిమా ఇండస్ట్రీలో కళా తపస్విగా పేరు సంపాదించుకున్న కే విశ్వనాథ్ కి ఎలాంటి ప్రత్యేక స్థానం ఉందో అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో బోలెడు డైరెక్టర్లు ఉన్న, సీనియర్ స్టార్స్ ఉన్న కే విశ్వనాథ్ అంటే అందరూ చేతులెత్తి దండం పెడతారు . మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి నిన్న కాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన విశ్వక్ సేన్ వరకు అందరూ కే విశ్వనాథ్ కి బిగ్గెస్ట్ ఫ్యాన్స్ . ఆయన కెరియర్ లో ఎన్నో సినిమాలను డైరెక్ట్ చేశారు . కాగా అన్నిటికన్నా ఆయన కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా గుర్తింపు సంపాదించుకుంది శంకరాభరణం .
ఆయన కొన్ని గంటలకు ముందే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు . అనారోగ్య కారణంగా బాధపడుతున్న కే విశ్వనాధ్ తుది శ్వాస విడిచారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో విశ్వనాధ్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ కి ఎంతో ఆప్తుడైన ఫ్రెండ్ గురించి సోషల్ మీడియా వైరల్ అవుతుంది . ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈయన ఓ సాధారణ టైలర్ మాత్రమే . ఆయన పేరు నారాయణ రావు. ఇతనికి విశ్వనాథ్ కి ఏ సంబంధం లేదు శుభసంకల్పం సినిమా వీరిద్దరినీ కలిసేలా చేసింది. ఇప్పుడు ఆత్మీయ బంధంగా మారింది.
శుభసంకల్పం సినిమా టైంలో సూట్ కుట్టించాల్సిన సందర్భంలో అప్పటికప్పుడు హడావిడిగా ఆయన మెటీరియల్ తీసుకొని టైలర్ నారాయణ వద్దకు వెళ్లారు . నారాయణ కూడా ఆయనంటే ఎంతో ఇష్టపడేవారు . అప్పటికే వైజాగ్ లో సూట్ స్పెషలిస్ట్ గా ఉన్న నారాయణరావు వద్దకు విశ్వనాధ్ లాంటి పెద్దాయన వచ్చి ఆయన సూచన మేరకు అద్భుతంగా సూట్ కుట్టించుకున్నారట . ఎంతలా అంటే ఇప్పటివరకు కే విశ్వనాధ్ కి అలా ఎవరు సూట్ కుట్టించే వారే లేరట . అంతేకాదు అలా సూట్ తో స్నేహబంధం పెరిగి పెరిగి పెద్దదిగా మారింది . ఈ స్నేహబంధం ఏర్పడి 25 ఏళ్లు పైనే అవుతుంది .
కాగా నిన్న మొన్నటి వరకు కూడా విశ్వనాధ్ తన పుట్టినరోజుకు ఆయన వద్ద సూట్ కుట్టించుకుని వేసుకునే వారట . ఆయన సూట్ కుడితే వేసుకునే ఆనందం వర్ణాతీతం అంటూ ఎన్నోసార్లు విశ్వనాధ్ చెప్పకు వచ్చారు . ఇలా సూట్ తో ఏర్పడిన స్నేహబంధం గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!