సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచి .. ఆయనలోని నటనను పూర్తిస్థాయిలో బయటపెట్టిన చిత్రం చంటి. అప్పటి వరకు వెంకటేష్ సినిమాలు చేస్తున్నా స్టార్‌డమ్ రాలేదు. అయితే చంటి సినిమాతో వెంకీకి పిల్లలతో పాటు మహిళా ప్రేక్షకుల్లోనూ తిరుగులేని ఫాలోయింగ్ వచ్చేసింది. ఆ సినిమాలో అమాయకపు నటనతో వెంకీ మెస్మరైజ్ చేసేశాడు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు కేఎస్. రామారావు దర్శకుడు.
అప్పట్లో ఈ సినిమా ట్రెండ్ సెట్ చేయడంతో పాటు తెలుగునాట ఏకంగా 200కు పైగా రోజులు ఆడింది. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానంతో పాటు వెంకీ పాత్రను అమాయకంగా మిలిచిన తీరు ప్రతి ఒక్కరిని కదిలించేసింది. అసలు ఈ సినిమా ముందుగా తమిళ్‌ది. తంబి అని అక్కక పి. వాసు దర్శకత్వంలో వచ్చిన సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా రైట్స్ నిర్మాత కేఎస్. రామారావు కొనుగోలు చేసి రాజేంద్ర ప్రసాద్ హీరోగా తీయాలని అనుకున్నారు.
రాజేంద్ర ప్రసాద్‌కు ఈ విషయం చెప్పేశారు. ఆయన కూడా ఈ రీమేక్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పేశారు. అయితే ఆ తర్వాత ఈ సినిమాను రామానాయుడు చూశారు. ఆయనకు బాగా నచ్చింది. ఇది వెంకటేష్‌తో తెలుగులో చేయాలని అనుకున్నారు. అయితే ఈ సినిమా రీమేక్ రైట్స్ కేఎస్. రామారావు కొన్నారన్న విషయం తెలుసుకుని వెంకటేష్‌తోనే చేయాలని ఒత్తిడి చేశారు.
రామానాయుడు స్వయంగా ఒత్తిడి చేయడంతో రామారావు కాదనలేక రాజేంద్రప్రసాద్ ప్లేస్‌లో వెంకీని పెట్టి చంటి సినిమా తీసేశారు. దీంతో రాజేంద్రప్రసాద్ బాగా హర్ట్ అయ్యారు. వెంకటేష్ వాళ్లు తమ బలం చూపించి తనకు రావాల్సిన హిట్ సినిమా కొట్టేశారని రాజేంద్రప్రసాద్ అప్పట్లో బాధపడ్డారట. చివరకు ఈ సినిమా చంటిగా తెరకెక్కి తిరుగులేని బ్లాక్‌బస్టర్ అయిపోయింది.
నిజంగా ఈ సినిమా అప్పట్లో రాజేంద్రప్రసాద్ చేసి ఉంటే ఆయన కెరీర్‌లో తిరుగులేని సినిమాగా ఉండడంతో పాటు ఆయన కెరీర్ మరో మెట్టుపైనే ఉండేదని అంటారు. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్‌కు, వెంకటేష్‌కు మధ్య గ్యాప్ వచ్చిందని అంటారు.