సినిమా రంగంలో హీరోలు, హీరోయిన్ల ఎఫైర్లు మాత్రమే కాదు.. దర్శకులు. హీరోయిన్ల ఎఫైర్లు కూడా ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటూ వస్తున్నాయి. రీసెంట్ టైమ్స్ లో త్రివిక్రమ్ సమంతకు తాను దర్శకత్వం వహించిన మూడు సినిమాలలో అవకాశం ఇచ్చారు. అంతకుముందు ఇలియానాను కూడా రెండుసార్లు వాడారు. ఇక ఇప్పుడు వరుసగా మూడుసార్లు పూజా హెగ్డే కు అవకాశం ఇస్తున్నారు. త్రివిక్రమ్ హీరోయిన్లను వరుసగా రిపీట్ చేస్తూ ఉండడంతో ఆ హీరోయిన్లకు.. త్రివిక్రమ్ కు మధ్య ఏదేదో ఉందని వార్తలు అల్లేయటం.. పుకార్లు షికార్లు చేయటం మామూలుగా నడుస్తోంది.
అలాగే నిర్మాతలకు, హీరోయిన్ల మధ్య ఎఫైర్ వార్తలు కూడా ఎప్పుడూ ఫేమస్సే. దర్శకులు – హీరోయిన్లు, నిర్మాతలు – హీరోయిన్ల మధ్య ఎఫైర్ వార్తలు అనేవి ఇప్పటినుంచే కాదు గత ఆరేడు దశాబ్దాల క్రిందట ఉన్నాయి. అసలు కొన్ని ఎఫైర్ వార్తలు మనం కలలో కూడా ఊహించని వాళ్లపై వస్తూ ఉంటాయి. 1950 – 70వ దశకంలో దుక్కిపాటి మధుసూదన్‌రావు అంటే టాలీవుడ్‌లో ఫేమస్. ఆయన్ను ముద్దుగా విక్టరీ మధుసూదన్‌రావు అని పిలుచుకునేవారు.
ఇంకా చెప్పాలంటే ఏఎన్నార్‌కు ఆయన గురువు. ఇద్దరిది గుడివాడ తాలూకానే. అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై ఎక్కువ సినిమాలు నిర్మించిన నిర్మాత ఆయన. ఆయన బ్యానర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్లు వచ్చాయి. ఆయన టాలీవుడ్ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలి వచ్చేందుకు ఏఎన్నార్‌తో కలిసి ఎంతో కృషి చేశారు. అందుకే ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డు కూడా వచ్చింది.
కెరీర్‌లో చిన్న రిమార్క్ కూడా లేని ఆయనకు హీరోయిన్ కాంచనకు మధ్య ఎఫైర్ ఉందన్న పుకార్లు వినిపించాయి. అప్పట్లో దీనిని ఎవ్వరూ నమ్మలేదు. ఇది పుకారు పుకారుగానే ఉండిపోయింది. అయితే మధుసూదన్‌రావు గారు ఇండస్ట్రీని వదిలేశాక చాలా యేళ్లకు మరో ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి నవ్విపోదురు గాక అని తన ఆత్మకథను రాసుకున్నాడు.
అందులో ఆయన ఓ పేజీలో నేను మధుసూదన్‌రావు గారి ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ కాంచన గారు కూడా ఉన్నారు అని చిన్న వాక్యం రాసుకువచ్చారు. ఆ ఒక్క వాక్యాన్ని పాత పుకారును లింక్ చేసి నిజంగానే వారిద్దరికి మధ్య లింక్ ఉందని పుకారను బతికించే ప్రయత్నం చేశారు కొందరు గాసిప్ రాయుళ్లు. సినిమా ఇండస్ట్రీలో పుకార్లు ఎలా పడతాయి… ఒకదానికి ఒకటి లింకప్ చేసి ఎలా హైలెట్ చేస్తారు అనేందుకు ఈ సంఘటనే నిదర్శనం.