Moviesథ‌మ‌న్ త‌న భార్య‌ను ప‌క్క‌న పెట్ట‌డానికి వాళ్లే కార‌ణ‌మా... అస‌లు ఇష్యూ...

థ‌మ‌న్ త‌న భార్య‌ను ప‌క్క‌న పెట్ట‌డానికి వాళ్లే కార‌ణ‌మా… అస‌లు ఇష్యూ ఏంటి…!

సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ ఇప్పుడు టాలీవుడ్‌లో పాపుల‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. మ‌హామ‌హా స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్లు కూడా థ‌మ‌నే త‌మ సినిమాల‌కు మ్యూజిక్ ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ మ‌నోడినే పెట్టుకుంటున్నారు. అస‌లు కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా థ‌మ‌న్‌తోనే మ్యూజిక్ చేయించుకోవాలని డిసైడ్ అవుతున్నారు.

ఇక థ‌మ‌న్ ఎవ‌రో కాదు ఒక‌ప్ప‌టి దిగ్గ‌జ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఘంట‌సాల వెంక‌టేశ్వ‌ర‌రావుకు స్వ‌యానా మ‌న‌వ‌డు. థ‌మ‌న్ భార్య కూడా చాలా మంచి సింగ‌ర్‌. అయితే ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. థ‌మ‌న్‌ది ల‌వ్ మ్యారేజ్‌. థ‌మ‌న్ కెరీర్ స్టార్టింగ్‌లో త‌న భార్య‌తో కొన్ని సాంగ్స్ కూడా పాడించాడు. అయితే ఇప్పుడు థ‌మ‌న్ భార్య ఎక్క‌డా పాట‌లు పాడ‌డం లేదు.

దీనిపై థ‌మ‌న్ ఇన్నాళ్ల‌కు క్లారిటీ ఇచ్చాడు. తాను ఫ్యామిలీ ప్యాకేజ్ అవ్వ‌డం, అనిపించుకోవడం ఇష్టంలేద‌ని.. నిర్మాత‌లు నాపై కోట్లు ఖ‌ర్చుపెడుతున్నార‌ని.. అలాగే త‌న‌పేరు చూసే ఆడియో కంపెనీలు కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు పెడుతున్నార‌ని.. నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడు ఏ సింగర్‌తో పాడించాల‌ని అడుగుతారో ? వాళ్ల‌తోనే పాడిస్తాన‌ని థ‌మ‌న్ తెలిపాడు.

నా భార్య బాగా పాడుతుంద‌నో లేదా ప‌లానా సింగ‌ర్ పాడుతుంద‌నో త‌న ఇష్టం మేర‌కు పాట‌లు పాడించ‌న‌ని.. త‌న ఫ్యామిలీని లోప‌ల‌కు తీసుకురాకూడ‌ద‌ని థ‌మ‌న్ తేల్చిచెప్పాడు. న‌న్ను న‌మ్మి వాళ్లు తీసుకుంటార‌ని.. నా ఫ్యామిలీని కావాల‌ని బుక్ చేసుకోకూడ‌దు క‌దా ? అని చెప్పాడు. త‌న‌కంటే త‌న భార్య మంచి టాలెంటెడ్ అయినా.. ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు చెప్పి వాళ్ల‌కు ఛాన్సులు ఇవ్వ‌న‌న్నాడు. అయితే త‌న సినిమాల‌తో కాకుండా.. త‌న భార్య‌ను ఖ‌చ్చితంగా ఎస్టాబ్లిష్ చేస్తాన‌ని.. ఇందుకోసం ఓ ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసే ఆలోచ‌న ఉంద‌ని కూడా థ‌మ‌న్ చెప్పాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news